మంచు విష్ణు( Manchu Vishnu ) హీరోగా ముఖేష్ కుమార్ సింగ్ ( Mukesh Kumar Singh )డైరెక్షన్ లో తెరకెక్కిన కన్నప్ప సినిమా టీజర్ తాజాగా విడుదలైంది.84 సెకన్ల నిడివితో విడుదలైన ఈ టీజర్ లో గూస్ బంప్స్ వచ్చే మూమెంట్స్ ఎక్కువగానే ఉన్నాయి.టీజర్ లో ప్రభాస్ కనిపించింది కొన్ని సెకన్లు మాత్రమే ప్రభాస్ లుక్ మాత్రం అదిరిపోయిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో కనిపించగా కాజల్ పార్వతిగా కనిపించారు.
కన్నప్ప మూవీ( Kannappa movie ) మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కాగా టీజర్ లో డైలాగ్స్ మాత్రం అదిరిపోయాయి.తిన్నడు పాత్రకు మంచు విష్ణు పూర్తి స్థాయిలో న్యాయం చేశారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయ్.
ఏప్రిల్ నెల 25వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానున్న కన్నప్ప మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేయడం పక్కా అని ఈ విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదని కచ్చితంగా చెప్పవచ్చు.

మంచు విష్ణు తన గత సినిమాతో పోల్చ్ చూస్తే ఈ సినిమాకు 10 రెట్లు ఎక్కువ మొత్తం ఖర్చు చేశానని వెల్లడించడం గమనార్హం.కన్నప్ప టీజర్ వ్యూస్ విషయంలో సైతం అదరగొడుతోంది.టీ సిరీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ టీజర్ విడుదలైంది.
ఏప్రిల్ నెలలో ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉంది.మంచు విష్ణు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శ్రీకాళహస్తిలో ( Pre release event at Srikalahasti )జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.బీజీఎం టీజర్ కు హైలెట్ గా నిలిచింది.మోహన్ బాబు డైలాగ్ టీజర్ లో ఎంతగానో ఆకట్టుకుంది.మంచు విష్ణు కెరీర్ బెస్ట్ మూవీగా ఈ సినిమా నిలిచే ఛాన్స్ ఉంది.ఈ సినిమా డైలాగ్స్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది.కన్నప్ప సినిమా ప్రమోషన్స్ విషయంలో విష్ణు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.







