రష్యన్ జాలరికి చిక్కిన వింత జీవి.. గ్రహాంతరవాసియేనా అంటూ నెటిజన్ల చర్చలు!

ఇటీవల రష్యాకు( Russia ) చెందిన రోమన్ ఫెడర్త్సోవ్ అనే జాలరి( Fisherman ) సముద్రంలో చేపలు పడుతుండగా ఓ వింతైన జీవి( Strange Creature ) అతనికి చిక్కింది.చూడ్డానికి గుండ్రంగా, ఉబ్బినట్టు, బూడిద రంగు చర్మంతో ఉన్న ఆ జీవిని చూసి జనాలు షాక్ తిన్నారు.

 Fisherman Catches Bizarre Alien-like Sea Creature Smooth Lumpsucker Video Viral-TeluguStop.com

గల్ఫ్‌లో చేపలు పడుతుండగా దొరికిన ఈ వింత జీవి వీడియోను ఫెడర్త్సోవ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో అది వైరల్ అయిపోయింది.

ఫెడర్త్సోవ్ దాన్ని స్మూత్ లంప్‌సక్కర్( Smooth Lumpsucker ) అనే అరుదైన సముద్రపు చేపగా గుర్తించాడు.

ఇది రే-ఫిన్డ్ ఫిష్ గ్రూప్‌కు చెందినది, అడుగు పొడవు వరకు పెరుగుతుంది.ఈ వింత జీవిని చూపించే వీడియో క్షణాల్లో వైరల్( Viral Video ) అయిపోయింది.

నెటిజన్లు ఆ వింత చేపను చూసి నోరెళ్లబెట్టారు.కొందరైతే ఇది ఏకంగా గ్రహాంతర జీవేమో అని కామెంట్లు పెట్టడం మొదలుపెట్టారు.

“అవును ఏలియన్స్( Aliens ) నిజంగానే ఉన్నారు” అంటూ ఒకరు కామెంట్ చేస్తే, మరొకరు మరింత డ్రామా క్రియేట్ చేస్తూ “దాన్ని చంపి తగలబెట్టండి.మళ్లీ దాన్ని ఎప్పుడూ పట్టుకోకండి.” అంటూ భయానకంగా రియాక్ట్ అయ్యారు.ఇంకొందరు దీన్ని ఫేమస్ క్యారెక్టర్లతో పోల్చారు.

ఒక యూజర్ దాన్ని “మెగామైండ్” అంటూ కామెంట్ చేశాడు.మరికొందరు హ్యారీ పోటర్ లోని “డార్క్ లార్డ్”తో పోల్చారు.

ఇలాంటిదే మరో వింత సంఘటన అమెరికాలో జరిగింది.ఎరిక్ ఓసింకీ అనే అమెరికన్ జాలరికి గతేడాది జూన్‌లో హడ్సన్ వ్యాలీ, న్యూయార్క్‌లో చేపలు పడుతుండగా వింతైన చేప చిక్కింది.దాని నోరు చూస్తే ఎవరికైనా వణుకు పుట్టేలా ఉంది.

ఓసింకీ ఆ వింత జీవి ఫొటోలను క్యాట్‌స్కిల్ అవుట్‌డోర్స్ ఫేస్‌బుక్ గ్రూప్‌లో షేర్ చేశాడు.

ఆ ఫొటోల్లో ఈల్ లాంటి చేప, చాలా వరసల్లో పదునైన దంతాలతో భయానకంగా కనిపించింది.ఆ చేపను సీ లాంప్‌రేగా గుర్తించారు.ఇది పరాన్నజీవి జాతికి చెందిన చేప.ఇది తనంతట తాను ఇతర చేపలకు అతుక్కుని, తన వాక్యూమ్ లాంటి నోటితో వాటి చర్మాన్ని పగలగొట్టి రక్తం, ఇతర ద్రవాలను పీల్చుకుంటుంది.

ఈ రెండు డీప్-సీ డిస్కవరీలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.సముద్రంలో ఇంకా ఎన్ని వింత జీవులు ఉన్నాయో అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube