టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి( Rajamouli ) గురించి మనందరికీ తెలిసిందే.రాజమౌళి ఎంతసేపు తన సినిమాల గురించి మాట్లాడుతూ ఉంటారు.
సినిమాలు చేయడం వాటిని ప్రమోట్ చేయడం ఏదైనా ఈవెంట్లో కనిపించడం తప్ప కాంట్రవర్సీలలో ఆయన తల దూర్చరు.అలాంటి కామెంట్స్ కూడా ఎప్పుడు చేయరు.
ఇంకా చెప్పాలంటే కాంట్రవర్సీలకు ఒక కిలోమీటర్ దూరంలో ఉంటారని చెప్పాలి.అలాంటి రాజమౌళి పై ఇప్పుడు ఆరోపణలు వెళ్ళు వెత్తాయి.
అలాంటి ఇలాంటి ఆరోపణలు కాదండోయ్ తీవ్రమైన ఆరోపణలు అని చెప్పాలి.రాజమౌళిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఉప్పలపాటి శ్రీనివాసరావు( Uppalapati Srinivasa Rao ) అనే వ్యక్తి.

రాజమౌళి తీసిన యమదొంగ చిత్రానికి( Yamadonga Movie ) ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈయన రాజమౌళితో తనది 35 ఏళ్ల స్నేహ బంధం అని చెప్పుకుంటున్నారు.ఇప్పుడు రాజమౌళి కారణంగా తను చనిపోతున్నానంటూ వీడియో రిలీజ్ చేసి అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చారు.ఆ వీడియోలో శ్రీనివాసరావు మాట్లాడుతూ.ఇండియా నంబర్ వన్ డైరక్టర్ రాజమౌళి, రమా రాజమౌళి వల్ల నేను చనిపోతున్నాను.దానికి సంబంధించి నేను ఇస్తున్న మరణ వాంగ్మూలం ఇది.వీడేంటి పబ్లిసిటీ కోసం ఇదంతా చేస్తున్నాడా అని మీరు అనుకోవద్దు.పబ్లిసిటీ కోసం చేయాలనుకునేవాడు చనిపోవాలని అనుకోడు.అందుకే మరణ వాంగ్మూలం ఇస్తున్నాను.మాది 34 సంవత్సరాల స్నేహం.

ఒక అమ్మాయి వల్ల ఇలా అవుతుందని కలలో కూడా ఊహించలేదు.మా జీవితాల్లోకి కూడా ఒక అమ్మాయి వచ్చింది.ముందు రాజమౌళి, తర్వాత నేను.
మాది ట్రయింగిల్ లవ్ స్టోరీ.( Triangle Love Story ) ముగ్గురుం క్లోజ్ గా ఉండడం వల్ల ఏం చేద్దామని రాజమౌళిని అడిగాను.
నన్ను త్యాగం చేయమన్నాడు.కుదరదు అన్నాను.
ముగ్గురం కలిసి ఉందామని aన్నాను.దారుణంగా ఉంటుంది వద్దని అన్నాడు.నేను పెళ్లి చేసుకుంటా నలుగురం కలిసి ఉందామని అన్నాను.అందుకు సమాజం ఒప్పుకోదని అన్నాడు.గతంలో జరిగిన విషయాల్ని తను చెబుతాననే అనుమానంతో రాజమౌళి తనను టార్చర్ చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు.ఇక తను ఈ నరకాన్ని భరించలేనని, చనిపోతున్నానంటూ వీడియో రిలీజ్ చేశారు.
తన కేసును సుమోటాగా తీసుకొని, రాజమౌళికి లై డిటెక్టర్ పరీక్ష చేయాలని ఆయన వీడియోలో కోరారు.ఈ సందర్భంగా ఆయన విడుదల చేసిన వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది.
ఒక వీడియోతో ఇప్పటివరకు రాజమౌళి గురించి పాజిటివ్ గా మాట్లాడుకున్న వారి నెగటివ్ గా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.







