అధికంగా తింటున్నారా..? అయితే మీకు ఈ సమస్యలు తప్పవు..!

ఈమధ్య చాలా మంది తిండే పరామావధిక అని భావించి ఎప్పుడు తింటూనే ఉన్నారు.మరి ముఖ్యంగా వారికి ఇష్టమైన బిర్యాని, జంక్ ఫుడ్ కనిపిస్తే కడుపు నిండా లాగించేస్తున్నారు.

 You Will Face Thest Health Problems By Over Eating Details, Food , Over Eating,-TeluguStop.com

సంతోషం కలిగినప్పటికీ ఇలానే కొనసాగిస్తే చాలా భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇలా తరచూ తినడం వలన వారి శరీరంలో ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

ఇలా ఎక్కువగా తినడం వలన కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.అతిగా తింటూ ఉండడానికి కారణం వారి శరీరంలో పోషకాలు సరిగా అందకపోవడం అని చెప్పవచ్చు.

Telugu Carbohydrates, Problems, Tips, Heart Problems, Junk, Obesity-Telugu Healt

లేదా కార్బోహైడ్రేట్స్ ( Carbohydrates ) అధికమైనప్పుడు కూడా ఆకలి ఎక్కువగా అవుతుంది.దీంతో ఆకలి లేకున్నా ఎక్కువగా తింటూ ఉంటారు.ఇలా తినడం వలన దీర్ఘకాలిక సమస్యలు వస్తాయి.మన శరీరం జీర్ణించుకోలేక చెడు కొవ్వుల రూపంలో స్టోర్ చేసి పెట్టుకుంటుంది.దాని వలన ఊబకాయం( Obesity ) కలిగి ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తిండి విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది.

ఇక మన శరీరం తిన్నది సరిగా జీర్ణం చేసుకోవడానికి కొంత సమయం తీసుకుంటుంది.ఆ సమయంలో కూడా మనం తింటూ పోతే తిన్నది అస్సలు అరగదు.

ఇలా జీర్ణం కాని ఆహారం మన పొట్టలో రెండు మూడు రోజులు ఉంటే గ్యాస్ ఎక్కువ అవుతుంది.

Telugu Carbohydrates, Problems, Tips, Heart Problems, Junk, Obesity-Telugu Healt

ఈ గ్యాస్ గుండెల్లో మంట, మలబద్ధకం లాంటి సమస్యలను తీసుకొస్తాయి.ఎక్కువగా ఆహారం తీసుకోవడం వలన అలసట కూడా ఎక్కువగా కనిపిస్తుంది.తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడంతో శక్తి రిలీజ్ అవ్వదు.

దీంతో తొందరగా అలసట చెందుతారు.అధికంగా ఆహారం తీసుకోవడం( Over Eating ) వలన అతినిద్ర కూడా వస్తుంది.దీని వలన మన శరీరం జీవక్రియ రేటు తగ్గిపోతుంది.దీంతో ఎన్నో వ్యాధులకి కారణం అవుతుంది.అధికంగా తినడం వలన ఒత్తిడి పెరిగి డిప్రెషన్ లోకి వెళ్లిపోతారు.అందుకే ప్రతి ఒక్కరు సరైన ఆహారాన్ని, సరైన సమయాలు పాటించి తీసుకోవడం చాలా మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube