ఆదిపురుష్ సినిమాకంటే ఈ వీడియో నే బాగుంది..?

ప్రభాస్( Prabhas ) రాముడిగా కృతి సనన్ ( Kriti Sanon )సీత గా నటించిన సినిమా ఆదిపురుష్…ఈ సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది.అయితే ఈ సినిమా రిలీజ్ రోజు నుంచే నెగెటివ్ టాక్ ను అందుకుంది.

 This Video Is Better Than The Movie Adipurush, Adipurush, Kriti Sanon, Prabhas,-TeluguStop.com

ఈ మూవీ పై చాలా మంది విమర్శలు గుప్పించారు.మరి కొందరు కేసులు కూడా పెట్టారు.

సినిమా మేకింగ్ బాగున్నా, గ్రాఫిక్స్ సరిగ్గా లేదని, మూవీలోని పాత్రల ఆహార్యం, సంభాషణలు బాలేదని, రామాయణాన్ని అపహాస్యం చేశారని తీవ్రంగా విమర్శలు వచ్చాయి.

 This Video Is Better Than The Movie Adipurush, Adipurush, Kriti Sanon, Prabhas,-TeluguStop.com
Telugu Adipurush, Om Raut, Kriti Sanon, Prabhas, Ramayanam-Movie

డైరెక్టర్ ఓం రౌత్( Director Om Raut ) రామాయణాన్ని నూతన టెక్నాలజీ ద్వారా ఆడియెన్స్ కి చెప్పాలని అనుకున్నాడు.కానీ ప్రేక్షకుల మెప్పించడంలో ఫెయిల్ అయ్యాడు.ఆదిపురుష్ మూవీ కోసం రిహార్సల్స్ ఎలా చేశారో తెలిపే వీడియో తాజాగా రిలీజ్ అయ్యింది.

అయితే వీడియో చూసిన నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఆదిపురుష్ సినిమా మొదట్లో ప్రభాస్ ఎంట్రీ సన్నివేశంలో జరిగిన ఫైట్ ను ఎలా షూట్ చేశారు? ఫైట్ షూటింగ్ ముందు ఎలా వర్కవుట్ చేశారో తెలిపే వీడియో రిలీజ్ అయ్యింది.అయితే ఈ వీడియోలో ప్రభాస్ కు బదులుగా ఫైటర్స్ తో రిహార్సల్స్ ఫైట్ ను చిత్రీకరించారు.

ఆ తరువాత అదే ఫైట్ ను ప్రభాస్ పై షూట్ చేశారు.ఆ ఫైట్ సీన్స్ కు గ్రాఫిక్స్ యాడ్ చేశారు.

Telugu Adipurush, Om Raut, Kriti Sanon, Prabhas, Ramayanam-Movie

ఇక ఈ వీడియో చూసిన వారు ఇంత కష్టపడి పోరాట సన్నివేశాలను చిత్రీకరించారా అని కామెంట్స్ చేస్తున్నారు.మరి కొందరు డమ్మీ ఫైటర్స్‌తో చిత్రీకరించిన ఈ ఫైట్ సీన్‌ని, అనంతరం డమ్మీ ఫైటర్ ఫేస్ కు బదులుగా ప్రభాస్ ఫేసును అతికించే ఛాన్స్ ఉందని కామెంట్స్ పెడుతున్నారు.ఈ వీడియోలో చూపించిన ఫైట్ సీన్స్ ఎంతో క్లిష్టంగా ఉన్నాయి.వీటిని ట్రైనింగ్ తీసుకున్న ఫైటర్ మాత్రమే చేయగలడని, హీరో ప్రభాస్ అంత క్లిష్టమైన ఫైట్ ను ఫ్లెక్సిబుల్‌గా పోరాడగలరా అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

రామాయణ( Ramayanam ) ఇతిహాసం ఆధారంగా రూపొందిన సినిమా ఆదిపురుష్.ఈ మూవీలో హీరో ప్రభాస్ రాముడిగా, సీతాదేవిగా కృతి సనన్, లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్, హనుమంతుడి పాత్రలో దేవదత్ నగరే, రావణాసురుడుగా సైఫ్ అలీఖాన్ నటించారు.

ఈ చిత్రానికి డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం చేయగా, ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ నిర్మించారు.ఈ సినిమా డైరెక్టర్ అయిన ఓం రావత్ మీద పలు హిందూ సంఘాలు కూడా తీవ్రమైన కోపం తో ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే కనీస రామాయణం మీద పరిజ్ఞానం లేకుండా ఇలా సినిమా తీయడం చాలా దుర్మార్గం హిందువుల మనోభావాలను దెబ్బ తీయడమే అంటూ పలు రకాల కామెంట్లు కూడా చేశారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube