ఆగ్రాలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఉద్యోగి మనవ్ శర్మ దారుణ మరణం కలకలం రేపుతోంది.రిక్రూట్‌మెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న మనవ్, ఫిబ్రవరి 24న ఆత్మహత్య చేసుకుని తనువు చాలించడం విషాదాన్ని నింపింది.
చనిపోయే ముందు మనవ్ రికార్డ్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఆ వీడియోలో తన చావుకు గల కారణాలను మనవ్ కన్నీటితో వివరిస్తూ గుండెలు పిండేసే విషయాలు చెప్పాడు.
దాదాపు ఏడు నిమిషాల నిడివి ఉన్న ఆ వీడియోలో మనవ్ ( Manav )కన్నీళ్లు పెట్టుకుంటూ తన బాధను వెల్లడించాడు.తన భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, తనలాంటి మగవాళ్ల గోడు ఎవరూ వినరని ఆవేదన వ్యక్తం చేశాడు.“చట్టం మగవాళ్లను కూడా రక్షించాలి.లేకపోతే నిందలు మోయడానికి మగవాళ్లే మిగలని రోజు వస్తుంది.
నా భార్య మరొకరితో ఉందని తెలిసింది.కానీ దాని గురించి వద్దు.
నాకు విరక్తి కలిగింది.మగవాళ్ల గురించి కూడా ఎవరైనా మాట్లాడాలి.
మేం చాలా ఒంటరిగా ఫీలవుతున్నాం” అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు.
తన తల్లిదండ్రులకు, చెల్లికి క్షమాపణలు చెప్పి వీడియో ముగించాడు.
ఆ తర్వాత ఆగ్రాలోని డిఫెన్స్ కాలనీలో తన ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయినట్టు పోలీసులు గుర్తించారు.మనవ్ వీడియో బయటకు వచ్చిన తర్వాత, భార్య నికితా శర్మ ఆరోపణలపై స్పందించింది.
మనవ్ తనను అనుమానించేవాడని, వేరే సంబంధం ఉందని అనుమానం వ్యక్తం చేసేవాడని నికితా చెప్పింది.కానీ పెళ్లయ్యాక తాను ఎవరితోనూ అఫైర్ పెట్టుకోలేదని ఆమె స్పష్టం చేసింది.

మనవ్‌కు మద్యం అలవాటు ఉందని, గతంలో చాలాసార్లు ఆత్మహత్యాయత్నం చేశాడని నికితా ఆరోపించింది.మూడుసార్లు తానే అతన్ని కాపాడానని, ఆగ్రాకు తిరిగి తీసుకొచ్చానని చెప్పింది.చనిపోయిన రోజు రాత్రి కూడా మనవ్ తనను ఇంటి దగ్గర దింపి వెళ్లాడని నికితా తెలిపింది.మనవ్ తనను గృహహింసకు గురి చేసేవాడని కూడా నికితా ఆరోపించింది.“నన్ను కొట్టేవాడు.ఈ విషయం అతని తల్లిదండ్రులకు చెప్పాను.
అతని తాగుడే సమస్య అని చెప్పాను.మాతోనే ఉండమని అడిగాను.
కానీ వాళ్లు రెండు రోజులు మాత్రమే ఉండి, భార్యాభర్తల మధ్య గొడవలు మీరే పరిష్కరించుకోవాలి అని చెప్పి వెళ్లిపోయారు” అని నికితా వాపోయింది.మనవ్ చనిపోయే కొద్దిసేపటి ముందు అతని చెల్లికి కూడా తాను ఫోన్ చేసి చెప్పానని, కానీ ఆమె పట్టించుకోలేదని నికితా ఆరోపించింది.

మనవ్ తల్లిదండ్రులు సదర్ పోలీస్ స్టేషన్‌లో( Sadar Police Station ) ఫిర్యాదు చేయడానికి వెళ్లగా, మహా శివరాత్రి డ్యూటీల వల్ల పోలీసులు కేసు తీసుకోలేదని తెలుస్తోంది.దీంతో వాళ్లు సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు సీఎం పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేశారు.ఆ తర్వాత పోలీసులు వాట్సాప్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.మనవ్ ఆరోపణలు, నికితా వాదనలపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.ఈ కేసు ఇప్పుడు సంచలనంగా మారింది.







