ముంబైలో( Mumbai ) ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.దానికి సంబంధించిన వీడియో వైరల్ అయింది.
ఫుట్‌పాత్‌పై బైక్‌పై దూసుకొచ్చిన ఓ తాగుబోతు, అతన్ని ప్రశ్నించిన వృద్ధుడిపై పిడిగుద్దులు కురిపించాడు.పాపం ఆ ముసలితాత ఆ బైకర్ అరాచకానికి చిగురుటాకుల వణికిపోయాడు.
పరేష్ పటేల్ ( Paresh Patel )అనే స్థానికుడు తన బిల్డింగ్ కిటికీలోంచి ఈ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్తా వైరల్ అయిపోయింది.హెల్మెట్ లేకుండా వచ్చిన ఆ బైకర్ ట్రాఫిక్ రూల్స్‌ని తుంగలో తొక్కి రోడ్డు మీద వెళ్లాల్సింది పోయి ఫుట్‌పాత్‌పై బైక్ నడిపాడు.
అది చూసిన ఓ వృద్ధుడు అభ్యంతరం చెప్పడంతో ఆ తాగుబోతుకి కోపం నషాళానికంటింది.తన తప్పు ఒప్పుకునే బదులు, మరింత రెచ్చిపోయాడు.
ఆ ముసలి వ్యక్తిని బలంగా కిందకు తోసేసి, చెంప చెల్లుమనిపించాడు.నోటికొచ్చిన బూతులు తిడుతూ రచ్చ చేశాడు.

ఇంకా షాకింగ్ ఏంటంటే, అంత జరుగుతున్నా చుట్టుపక్కల జనాలు గుమిగూడారే కానీ, ఎవ్వరూ ఆ వృద్ధుడిని కాపాడటానికి ముందుకు రాలేదు.కొందరు వీడియో తీస్తూ ఉండిపోయారు, మరికొందరు అయితే నవ్వుతూ ఎంజాయ్ చేశారు.మరీ ఇంత దారుణమా అని నెటిజన్లు మండిపడుతున్నారు.తర్వాత ఆ బైకర్ ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధుడు తన హారన్ వినిపించుకోలేదని చెప్పాడు.అది విన్నవాళ్లంతా “ఇంత సిల్లీ రీజనా?” అని ముక్కున వేలేసుకుంటున్నారు.ఫుట్‌పాత్‌లు వాహనాల కోసం కాదు.
అసలు ఆ బైకర్ చేసింది పూర్తిగా చట్టవిరుద్ధం, పైగా తప్పేమీ లేనట్టు వాదిస్తున్నాడు.

బైకర్ రెచ్చిపోతూ వీరంగం వేస్తుంటే, సీన్ లోకి ఎవరూ ఊహించని హీరో ఎంట్రీ ఇచ్చింది, అదే ఒక వీధి కుక్క.అది వెంటనే ఆ వృద్ధుడి పక్కన నిలబడి అతన్ని కాపాడటానికి రెడీ అయిపోయింది.బైకర్‌ని చూసి గట్టిగా మొరుగుతూ, ఆ సిట్యుయేషన్ చూసి చాలా డిస్టర్బ్ అయినట్టుగా ప్రవర్తించింది.
ఆ కుక్క ధైర్యాన్ని చూసి అందరూ ఫిదా అయిపోతున్నారు.వీడియో తీసిన పరేష్ పటేల్ వెంటనే దాన్ని ఎక్స్‌లో పోస్ట్ చేసి ముంబై ట్రాఫిక్ పోలీసులకు ట్యాగ్ చేశాడు.
ఆ బైకర్ ఏం చేశాడో మొత్తం వివరించాడు.తాగి ఉన్నాడని, హెల్మెట్ పెట్టుకోలేదని, బూతులు తిట్టాడని, అంతేకాదు తర్వాత బీరు బాటిల్‌తో తన ఇంటిపై దాడి చేస్తానని కూడా బెదిరించాడని రాసుకొచ్చాడు.
ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఆ బైకర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
పోలీసులు ఈ వీడియోను చూసి ఏం చేస్తారో చూడాలి మరి.







