సినిమాలో ‘పుష్ప అంటే నేషనల్ కాదు.ఇంటర్నేషనల్’ అని పుష్పరాజ్ చెప్పినట్లుగానే, ఇప్పుడు ‘పుష్ప 2: ది రూల్’( Pushpa 2 The Rule ) సినిమా అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) ప్రధాన పాత్రలో, దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులు నెలకొల్పింది.థియేటర్లలో భారీ విజయాన్ని సాధించిన ఈ చిత్రం ఓటీటీలో కూడా సంచలనంగా మారి, గ్లోబల్ ఆడియన్స్‌ను ఆకర్షించింది.
తాజాగా, ఈ సినిమాకు చెందిన ‘పీలింగ్స్’ పాటను( Peelings Song ) NBAలో ప్రదర్శించడంతో ‘పుష్ప’ క్రేజ్ మరింత పెరిగింది.
అమెరికాలో( America ) ఎంతో ప్రతిష్టాత్మకమైన బాస్కెట్ బాల్ టోర్నీ NBAలో ‘పీలింగ్స్’ పాటకు స్పెషల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.
టెక్సాస్‌లోని హూస్టన్ రాకెట్స్, మిల్వాకీ బక్స్ మధ్య జరిగిన గేమ్ బ్రేక్ టైమ్‌లో దాదాపు 45 మంది డ్యాన్సర్లు ఈ పాటకు డ్యాన్స్ చేసి స్టేడియంలో సందడి చేశారు.ఈ వేడుకలో పాల్గొన్న ప్రేక్షకులు పాటకు అదిరిపోయే రెస్పాన్స్ ఇచ్చి, కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేశారు.
ఈ ప్రదర్శనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
NBA లాంటి ప్రపంచ స్థాయిలోని క్రీడా వేదికపై ‘పుష్ప 2’ సాంగ్ ప్రదర్శించబడిందంటే, ఈ సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు లభించిందని చెప్పక తప్పదు.అల్లు అర్జున్ అభిమానులు ఈ విషయాన్ని పెద్ద ఎత్తున షేర్ చేస్తూ, “పుష్ప 2 ఇంటర్నేషనల్ ఫిలిం” అని గర్వంగా చెప్పుకుంటున్నారు.గతంలో కూడా ‘గుంటూరు కారం’ సినిమాలోని ‘కుర్చీ మడతపెట్టి’ పాటను NBAలో ప్రదర్శించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ‘పుష్ప 2’లోని ‘పీలింగ్స్’ పాట NBA వేదికపై సందడి చేయడం మరో గొప్ప ఘట్టంగా నిలిచింది.
‘పుష్ప 2’ సినిమాలోని దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోగా.ఇందులో ప్రత్యేకంగా, ‘పీలింగ్స్’ పాట మ్యూజిక్ చార్ట్‌లను షేక్ చేసింది.మలయాళ-తెలుగు కలయికలో వచ్చిన ఈ డ్యాన్స్ నంబర్ యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
సినిమా రిలీజ్ సమయంలోనే ఈ పాటకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చి, సోషల్ మీడియాలో వేలాది రీల్స్ క్రియేట్ అయ్యాయి.ఈ పాటకు అల్లు అర్జున్, రష్మిక మందన్న వేసిన స్టెప్పులు యువతను విశేషంగా ఆకర్షించాయి.
ఫ్యాన్స్ మాత్రమే కాదు, సెలబ్రిటీల వరకు ఈ సాంగ్‌పై రియాక్షన్లు ఇచ్చారు.ఇప్పుడు NBA లాంటి అంతర్జాతీయ వేదికపై ‘పీలింగ్స్’ పాట ప్రదర్శించబడటంతో, ‘పుష్ప 2’ క్రేజ్ మరింత పెరిగింది.
ఇది తెలుగు సినిమా గ్లోబల్ రీచ్‌కు నిలువెత్తు నిదర్శనమని చెప్పొచ్చు.