ఈ మధ్యకాలంలో మెగాస్టార్ చిరంజీవికి ( Megastar Chiranjeevi )సరైన సక్సెస్ లేదనే సంగతి తెలిసిందే.వరుస ప్లాపులు చిరంజీవి మార్కెట్ పై తీవ్రస్థాయిలో ప్రభావం చూపాయి.
మరోవైపు చిరంజీవి పారితోషికం 60 నుంచి 70 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.అందువల్ల మెగాస్టార్ సినిమా అంటే కనీసం 150 నుంచి 200 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
చిరంజీవి గత సినిమాల ప్రభావం విశ్వంభర సినిమాపై పడిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
వాస్తవానికి విశ్వంభర సినిమా( visvambara ) ఈ ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కావాల్సి ఉన్నా వేరు వేరు కారణాల వల్ల వాయిదా పడింది.
విశ్వంభర మూవీ ఓటీటీ డీల్ ఫైనల్ కాకపోవడమే ఇందుకు కారణమని అప్పట్లో వార్తలు వినిపించాయి.ఇప్పుడు కూడా విశ్వంభర మూవీ రిలీజ్ డేట్ ప్రకటించకపోవడానికి అదే కారణమని తెలుస్తోంది.

యూవీ క్రియేషన్స్ నిర్మాతలు( Producers of UV Creations ) ఈ సినిమా కోసం ఒకింత భారీ స్థాయిలో ఖర్చు చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.దాదాపుగా 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది.విశ్వంభర గ్లింప్స్ విషయంలో నెగిటివ్ కామెంట్లు వ్యక్తమైన నేపథ్యంలో ఈ సినిమా గ్రాఫిక్స్ విషయంలో సైతం మేకర్స్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్.చిరంజీవికి జోడిగా ఈ సినిమాలో త్రిష నటిస్తున్నారు.

విశ్వంభర సినిమా ఎప్పుడు విడుదలైనా బాక్స్ ఆఫీస్ ( Box office )వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.మెగా హీరోలకు ఈ మధ్యకాలంలో విజయాల కంటే అపజయాలు ఎక్కువగా ఎదురవుతున్నాయి.విశ్వంభర సినిమాతో చిరంజీవి ఈ నెగటివ్ సెంటిమెంట్ కు సైతం చెక్ పెట్టాల్సిన అవసరం అయితే ఉందని కచ్చితంగా చెప్పవచ్చు.చిరంజీవి, చరణ్ కాంబినేషన్లో సినిమా రావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
చిరు, చరణ్ లకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.