అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్( Donald Trump ), ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ( Volodymyr Zelensky ) మధ్య జరిగిన మాటల యుద్ధం ఇప్పడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.వైట్‌హౌస్‌లో జరిగిన అధికారిక సమావేశంలో మీడియా ముందే ఇరువురు నేతలు పరస్పరం విమర్శలు చేసుకున్నారు.
శాంతి చర్చలకు వేదిక అయిన ఓవల్ కార్యాలయంలో చోటుచేసుకున్న ఈ ఘటన అనూహ్యంగా మారింది.డొనాల్డ్ ట్రంప్, జెలెన్‌స్కీ మధ్య భేటీ ముఖ్యంగా ఖనిజాల తవ్వకం ఒప్పందంపై చర్చించేందుకు జరిగింది.
అయితే, చర్చల అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ట్రంప్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వాతావరణం వేడెక్కింది.“జెలెన్‌స్కీ, ఒప్పందం కుదుర్చుకో.
లేదంటే మేం బయటకు వెళ్లిపోతాం” అంటూ ట్రంప్ వ్యాఖ్యానించగా.ఉక్రెయిన్ పరిస్థితి అత్యంత క్లిష్టమైనదిగా మారింది.
తమకు అమెరికా మద్దతు అవసరమని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు.అయితే, ట్రంప్ ఈ విషయాన్ని లైట్ తీసుకుంటూ, ఉక్రెయిన్ సంక్షోభం నుంచి బయటపడటం అసాధ్యమని హెచ్చరించారు.

ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి ఒప్పందం కోసం ప్రయత్నాలు జరుగుతున్న వేళ, జెలెన్‌స్కీ వ్యవహార శైలి సరిగా లేదని ట్రంప్ మండిపడ్డారు.ఆయన విధానం మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.లక్షలాది ప్రజల భవిష్యత్తును గాలికి వదిలేస్తున్నారని ట్రంప్ ఆరోపించారు.ఈ నేపథ్యంలో జెలెన్‌స్కీ కూడా కాస్త తీవ్రంగా స్పందించారు.“మీరు ఇప్పుడే ఈ సమస్యను అర్థం చేసుకోలేరు.కానీ భవిష్యత్తులో మీరు కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటారు” అంటూ ట్రంప్‌కు కౌంటర్ ఇచ్చారు.

ట్రంప్, జెలెన్‌స్కీ మధ్య వాగ్వాదం తీవ్రమవుతున్న తరుణంలో, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ( JD Vance )జోక్యం చేసుకున్నారు.“గట్టిగా మాట్లాడటం మానుకోండి.శాంతి కోసం దౌత్య చర్చలు అవసరం” అంటూ జెలెన్‌స్కీకి సూచించారు.దీనికి వెంటనే స్పందించిన జెలెన్‌స్కీ, “ఎలాంటి దౌత్యం?” అంటూ ప్రశ్నించారు.ట్రంప్, జేడీ వాన్స్ దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.ఇలాంటి ప్రవర్తన అమెరికా ప్రజలను అవమానించేలా ఉందని విమర్శించారు.
ఈ వాగ్వాదంతో ఖనిజాల తవ్వకం ( Mining of minerals )ఒప్పందంపై సంతకం జరగలేదు.వైట్‌హౌస్‌లో వివాదాస్పద వాతావరణం నెలకొన్న నేపథ్యంలో జెలెన్‌స్కీ ఒప్పందం కుదుర్చుకోకుండానే అక్కడి నుంచి వెనుదిరిగారు.
ఆ తరువాత X (ట్విట్టర్)లో స్పందించిన జెలెన్‌స్కీ, “ఉక్రెయిన్‌కు న్యాయం, శాశ్వత శాంతి కావాలి.అందుకోసం మేము పనిచేస్తూనే ఉంటాం” అంటూ స్పష్టం చేశారు.ఇదిలా ఉంటే.ట్రంప్, జెలెన్‌స్కీ మధ్య చోటుచేసుకున్న మాటల యుద్ధం, భవిష్యత్తులో ఉక్రెయిన్-అమెరికా సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో వేచి చూడాలి.







