మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న కన్నప్ప సినిమా( Kannappa movie ) గురించి మనందరికీ తెలిసిందే.ఈ సినిమాలో చాలామంది స్టార్ సెలబ్రిటీలు నటిస్తున్నారు.
కోట్ల బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ త్వరలోనే విడుదల కానున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా అభిమానులతో ముచ్చటించారు మంచు విష్ణు( Manchu Vishnu ).ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా వేదికగా అభిమానులు అడిగే చాలా రకాల ప్రశ్నలు సమాధానం ఇచ్చారు.

మంచు కుటుంబానికి సంబంధించిన ఓ ఘటన గురించి నెటిజన్ అడగ్గా.విష్ణు తనదైన శైలిలో స్పందించారు.నిన్ను ఏమన్నా.మాకు సమాధానం ఇచ్చిన మంచి మనసు నీది.మరి ఆ రోజు జనరేటర్‌లో షుగర్ ఎందుకు వేశావ్ అన్నా అని అడిగితే.‘ఇంధనంలో పంచదార కలిపితే మైలేజ్ పెరుగుతుందని చదివా అని విష్ణు సమాధానం ఇచ్చారు.
కన్నప్ప మూవీ బడ్జెట్ ఎంత? అని ప్రశ్నించగా.చాలా బిగ్ బడ్జెట్.నా గత చిత్ర బడ్జెట్‌కు 10 రెట్లు ఎక్కువ అని తెలిపారు.100కి పైగా అనాథలను చేరదీసి, చదువు చెప్పిస్తున్నారు కదా.ఇలా చేయడం మీ ఫాదర్ నుంచి నేర్చుకున్నారా? అనగా అవును అని సమాధానం ఇచ్చారు.

ఎన్టీఆర్( NTR ) గురించి ఒక్కమాటలో చెప్పండి అని అడగగా బ్రిలియంట్ యాక్టర్ అంటూ సమాధానం ఇచ్చారు.కన్నప్ప సినిమాలో ఏదైనా సర్‌ప్రైజ్ ఉందా? అని అడగగా.నా పిల్లలు కూడా ఈ సినిమాలో నటించారు అని తెలిపారు విష్ణు.
ప్రభాస్( Prabhas ) పారితోషికం తీసుకోకుండా నటించారట.నిజమేనా? అనగా అవును నిజమే అని సమాధానం ఇచ్చారు.ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను శ్రీకాళహస్తిలో నిర్వహిస్తారా? అని అడగగా అవును అని సమాధానం ఇచ్చారు.భవిష్యత్తులో మీరు నెగెటివ్ రోల్ ప్లే చేసే ఛాన్స్ ఉందా? అనగా నాకూ చేయాలనే ఉంది అని చెప్పుకొచ్చారు.ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కల్యాణ్ ను ఆహ్వానిస్తారా? అని అడగగా తప్పకుండా ఆయన్ను అడుగుతాము అని తెలిపారు.