స్టార్ సింగర్ అయినా శ్రేయా ఘోషల్( Shreya Ghoshal ) గురించి మనందరికీ తెలిసిందే.ఎన్నో అద్భుతమైన పాటలు పాడి సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
కొన్ని వేల పాటలు పాడి భారీగా అభిమానులను సంపాదించుకుంది.బాషతో సంబంధం లేకుండా అభిమానులను సంపాదించుకుంది.
చిన్న అద్భుతమైన ఆ పాటలను ఆలపించింది.అయితే ఇప్పటివరకు ఆమె కెరియర్ లో ఎన్నో పాటలు పాడి ఉంటుంది.
కానీ ఒక్క పాట విషయంలో మాత్రం ఆమె బాధపడుతోందట.

ఆ పాట పాడానందుకు ఆమె ఫీల్ అవ్వడంతో పాటు, ఆ పాట పాడకుండా ఉండాల్సింది అని అనుకుంటుందట.ఇంతకీ ఆ పాట ఏది? ఎందుకు ఆమె అలా అనుకుంటుంది అన్న వివరాల్లోకి వెళితే. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ ( Telugu, Tamil, Malayalam, Hindi )అని చాలా భాషల్లో పాటలు పాడి భారతదేశంలో మంచి పేరు తెచ్చుకున్నారు శ్రేయా ఘోషల్.
ఆమె చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ తో పని చేశారు.శ్రేయా ఘోషల్ పాట పాడింది అంటే చెవుల్లో అమృతం పోసినట్టు ఉంటుంది.అంత మధురమైన అరంతో పాటలు పాడుతూ మరొక లోకానికి తీసుకెళ్తూ ఉంటుంది.

అయితే ఎన్నో వేల అద్భుతమైన పాటలు పాడిన శ్రేయా ఒక పాట విషయంలో మాత్రం బాధపడుతున్నట్టు వెల్లడించింది.బాలీవుడ్ ( Bollywood )లో ఒక ఐటమ్ పాట పాడినందుకు బాధపడుతున్నానని శ్రేయా ఘోషల్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపింది.దాని గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.
చిక్నీ చమేలీ గురించి శ్రేయా ఘోషల్ మాట్లాడుతూ.ఆ పాట పాడినందుకు బాధపడుతున్నాను.
ఎందుకంటే ఆ పాట అర్థం ఏమిటో తెలియకుండానే పిల్లలు కూడా దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు అన్నారు.
ఇలాంటి పాటలు మగవాళ్లు రాయడం వల్ల అందులో ఆడవాళ్లను కించపరిచే పదాలు ఎక్కువగా ఉంటాయని శ్రేయా ఘోషల్ చెప్పారు.ఆడవారు కూడా పాటలు రాస్తే.
ఇటువంటి పదాలకు బ్రేక్ పడుతుందన్న అభిప్రాయం ఆమె వ్యక్తం చేశారు.ఆమె ఈ అభిప్రాయానికి కొంతమంది వ్యతిరేకంగా ఉన్నారు.







