టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి( Rajamouli ) ప్రస్తుతం వివాదంలో నిలిచిన సంగతి మనకు తెలిసిందే.ఈయన స్నేహితుడు ఉప్పలపాటి శ్రీనివాసరావు( Srinivas Rao ) రాజమౌళి గురించి సంచలన విషయాలను తెలియజేస్తూ ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు.
తామిద్దరం ఒకే అమ్మాయిని ప్రేమించామని అయితే రాజమౌళి కోసం నేను ఆ అమ్మాయిని త్యాగం చేశానని ఈ వీడియోలో తెలియచేశారు.ఇక ఈ మా ట్రయాంగిల్ లవ్ స్టోరీని సినిమాగా చేస్తాను అని నేను రాజమౌళితో చెప్పినప్పటి నుంచి ఆయన నన్ను టార్చర్ చేయడం మొదలుపెట్టారు.
అందుకే నేను చనిపోవాలనుకుంటున్నాను అంటూ ఒక వీడియోని విడుదల చేశారు.

ఇక ఈ వీడియో పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి రాజమౌళి వంటి గొప్ప డైరెక్టర్ పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ కొందరు ఈ వార్తలను ఖండిస్తున్నారు.అయితే ఇప్పటి వరకు రాజమౌళి మాత్రం ఈ వార్తలపై ఎక్కడ స్పందించలేదు.ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ ( Natti Kumar )ఈ ఘటనపై స్పందిస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేశారు.
ఈ సందర్భంగా ఉప్పలపాటి శ్రీనివాస్ రావు చేసిన వ్యాఖ్యలను నట్టి కుమార్ తప్పు పట్టారు.రాజమౌళితో ఈయన స్నేహం 30 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది.రాజమౌళి చేసిన సినిమాలకు కూడా ఈయన పనిచేశారు అయితే ఈ 30 సంవత్సరాలలో ఎప్పుడు రాని సమస్య రాజమౌళితో ఇప్పుడు ఈయనకి వచ్చింది అంటే డబ్బే ప్రధాన సమస్యగా కనిపిస్తోందని ఈయన తెలిపారు.

రాజమౌళితో నీకు సమస్య ఉంటే ఆయనతో వెళ్లి చర్చించుకోవాలి లేదా ఆయన చెవిలో వెళ్లి నీ సమస్యను చెప్పాలి కానీ , ఒక అమ్మాయిని మీ వివాదంలోకి లాగుతూ అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడటం సరైనది కాదని తెలిపారు.మీరు మాట్లాడుతున్న ఆ అమ్మాయికి పెళ్లి అయ్యి ఈ పాటికి తనకు మనవళ్లు మనవరాలు కూడా ఉండి ఉంటారు.ఇలా ఒక అమ్మాయి వ్యక్తిగత జీవితాన్ని రోడ్డుపైకి లాగటం సరైంది కాదని తెలిపారు.
ఈ 30 సంవత్సరాలలో లేని సమస్య మీకు ఇప్పుడు వచ్చింది అంటే ముసలోడివి అయ్యాక నీకు ఆ అమ్మాయి పై ప్రేమ గుర్తొచ్చి లవ్ స్టోరీ బయట పెడతారా? పిచ్చిపిచ్చి నాటకాలా? అమ్మాయితో ఆడుకుంటారా? ఏమైనా ఉంటే మీరిద్దరూ చూసుకోండి అంటూ నిర్మాత నటి కుమార్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.