టాలీవుడ్, కోలీవుడ్ (Kollywood, Tollywood)ఇండస్ట్రీలలో ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించి ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలతో సక్సెస్ ను సొంతం చేసుకున్న నటీమణులలో జ్యోతిక (jyotika)ఒకరు.భిన్నమైన కథలను ఎంచుకుంటూ జ్యోతిక విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.డబ్బా కార్టెల్ వెబ్ సిరీస్ (Dabba Cartel Web Series)ప్రమోషన్స్ లో భాగంగా జ్యోతిక మాట్లాడుతూ సౌత్ సినీ ఇండస్ట్రీలో (South film industry)నటిగా కెరీర్ ను కొనసాగించడం కష్టమని పేర్కొన్నారు.
28 సంవత్సరాల వయస్సులోనే నేను ఇద్దరు పిల్లలకు తల్లినయ్యానని ఆమె వెల్లడించారు.ఆ తర్వాత కూడా భిన్నమైన రోల్స్ లో నటిస్తూ నేను కెరీర్ ను కొనసాగిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు.అయితే పెళ్లి తర్వాత ఏ స్టార్ హీరో సరసన కూడా వర్క్ చేసే ఛాన్స్ నాకు రాలేదని జ్యోతిక చెప్పుకొచ్చారు.
కొత్త డైరెక్టర్లతో వర్క్ చేయడం చాలా పెద్ద సవాలు అని ఆమె కామెంట్లు చేశారు.

ఆ రోజుల్లో బాలచందర్ (Balachander)వంటి డైరెక్టర్లు, స్టార్ ప్రొడ్యూసర్లు మహిళల కోసం సినిమాలు తీసేవారని ప్రస్తుతం అలా ఎవరూ సినిమాలు తీయడం లేదని ఆమె తెలిపారు.ఇందుకు బడ్జెట్ ఒక కారణం అయితే ఏజ్ మరో కారణమని జ్యోతిక చెప్పుకొచ్చారు.మహిళల కొరకు గొప్ప కథలు రాసేవారు తగ్గిపోయారని ఆమె అన్నారు.
సౌత్ లో నటిగా కొనసాగడం చాలా కష్టమని ఎందుకంటే ఇక్కడ ఒంటరిగా పోరాటం చేయాల్సి ఉంటుందని జ్యోతిక పేర్కొన్నారు.

జ్యోతిక చెప్పిన విషయాలు నిజమేనని నెటిజన్లు సైతం అంగీకరిస్తున్నారు.జ్యోతిక సెకండ్ ఇన్నింగ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.జ్యోతిక కెరీర్ పరంగా ఎదిగి మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
జ్యోతిక కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి.జ్యోతికను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య మాత్రం అంతకంతకూ పెరుగుతోంది.







