అర‌వైలోనూ ఎముక‌లు బ‌లంగా ఉండాలంటే ఇది మీ డైట్‌లో ఉండాల్సిందే!

ఎముకల బలహీనత.ఇటీవల కాలంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య ఇది.ఎముకలు బలంగా ఉంటేనే ఏ పనినైనా చురుగ్గా చేయగలుగుతారు.లేదంటే ఇక అంతే.

 It's A Must Have In Your Diet For Strong Bones In Your 60s! Strong Bones, Magica-TeluguStop.com

అందుకే ఎముకలను బలంగా మరియు దూరంగా ఉంచుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.అందుకు పోషకాహారం తీసుకోవాలని సూచనలు చేస్తుంటారు.

కానీ చాలా మంది ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు.ఫలితంగా ఎముకల బలహీనత ఏర్పడుతుంది.

అయితే ఎముకల ఆరోగ్యానికి ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ డ్రింక్ అద్భుతంగా సహాయపడుతుంది.ఈ డ్రింక్‌ను డైట్ లో కనుక చేర్చుకుంటే అరవై లోనూ ఎముకలు బలంగా ఉంటాయి.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో ఐదు బాదం పప్పులు, ఐదు ఎండు ద్రాక్షలు, నాలుగు గింజ తొలగించిన ఖర్జూరాలు, ఒక కప్పు వాటర్ వేసుకుని నైట్ అంతా నానబెట్టుకోవాలి.

మరుసటి రోజు నానబెట్టుకున్న వాటిని మిక్సీ జార్‌లో వేసి మెత్తటి పేస్ట్ లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాసు పాలు వేసుకోవాలి.

పాలు కాస్త హీట్ అవ్వగానే అందులో చిటికెడు కుంకుమ పువ్వు, చిటికెడు పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి పది నిమిషాల పాటు మరిగించి స్టాప్ ఆఫ్ చేయాలి.

Telugu Tips, Healthy, Latest, Magical, Magical Bone-Telugu Health Tips

ఇలా మరిగించిన పాలను చల్లారనివ్వాలి.కంప్లీట్ గా కూల్ అయిన అనంతరం ఆ పాలలో అరకప్పు కొబ్బరి పాలు, గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమం, పావు స్పూన్ దాల్చిన చెక్క పొడి, అర స్పూన్ నెయ్యి వేసుకుని బాగా మిక్స్ చేస్తే ఎముకలను బలోపేతం చేసే మ్యాజికల్ డ్రింక్ సిద్ధమైనట్లే.రోజుకు ఒకసారి ఈ డ్రింక్ ను తీసుకోవాలి.

తద్వారా ఎముకలు బలంగా మారతాయి.అర‌వై, డ‌భై ఏళ్ళు వచ్చినా ఎముకల బలహీనత అన్నమాటే అనరు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube