సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న పలువురు ఆర్టిస్టులు సెలబ్రిటీలు రాజకీయాలలో కూడా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే .ఈ క్రమంలోనే పలువురు సినీ సెలబ్రిటీలు ప్రస్తుతం రాజకీయాల పరంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ముఖ్యంగా సినీ నటుడు రచయిత పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali) అరెస్టు (Arrest)అయిన విషయం మనకు తెలిసిందే.ఈయన గత ప్రభుత్వ హయామంలో పవన్ కళ్యాణ్ లోకేష్ చంద్రబాబు గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడంతోనే ఆయనపై కేసులు నమోదు కావడంతో అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

ఈ విధంగా పోసాని కృష్ణ మురళిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడంతో ఎంతోమంది వైసిపి నేతలు ఈయన అరెస్టును పూర్తిస్థాయిలో తప్పుపడుతున్నారు.ఈ క్రమంలోనే యాంకర్ శ్యామల(Shyamala) సైతం పోసాని అరెస్టు గురించి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ పూర్తిగా అరెస్టును ఖండించారు.ఇలా యాంకర్ శ్యామల చేసిన వ్యాఖ్యలకు మరో నటుడు కమెడియన్ కిరాక్ ఆర్పీ(Kirak RP) స్పందిస్తూ శ్యామలకు తనదైన శైలిలోనే కౌంటర్ ఇచ్చారు.

పోసాని కృష్ణమురళి అరెస్టు కావడంతో శ్యామలతో పాటు మరికొంతమంది ఆయన వెనుకే ఉంటూ తన అరెస్టును ఖండిస్తూ పోసాని వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు.సో ఇలా సమర్ధించే శ్యామల అదే పోసాని, కొడాలి నాని, రోజా, వంశీ లాంటి వారు పలికే అందమైన పదాలు తీసుకెళ్లి మీ పిల్లలకి నేర్పించాలి… అలా నేర్పించగలరా అంటూ ప్రశ్నించారు.ప్రతిరోజు ఉదయం వీరందరూ చెప్పే నీతి వ్యాఖ్యలను మీరు మీ పిల్లలకు బోధించండి.
ఇంత పచ్చిగా మాట్లాడే పోసానికి మీరు ఎలా సపోర్ట్ చేయగలుగుతున్నారు అంటూ ఈయన తనదైన శైలిలోనే శ్యామలపై విమర్శలు కురిపించారు.ఇక ఈయన గోరంట్ల మాధవ్ విషయాన్నీ కూడా ప్రస్తావిస్తూ మీ పిల్లలకు ఇలాంటివే నేర్పిస్తారా అంటూ ప్రశ్నించారు.
ఇకపోతే కథ కొంతకాలంగా కిరాక్ ఆర్పి వైకాపా నేతలపై విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.