ఊర్వశి రౌతేలా( Urvashi Rautela ).గత కొద్దిరోజులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలాగే సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు.
బాలయ్య బాబు( Balayya Babu ) హీరోగా నటించిన డాకు మహారాజ్ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించడంతో పాటు ఐటమ్ సాంగ్ కీ చిందులు వేసి భారీగా గుర్తింపు తెచ్చుకుంది ఊర్వశి.అంతేకాకుండా దబిడి దిబిడి సాంగ్ ను బాగా ప్రమోట్ చేయడంతో పాటు ఈ పాటతో భారీగా ఫేమస్ అయ్యిందని చెప్పాలి.
ఈ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మను ఫాలో అయ్యే వారి సంఖ్య మరింత పెరిగింది.అంతేకాకుండా ఈమెకు వరుసగా కూడా అవకాశాలు వచ్చి చేరుతున్నాయి.

అలా ప్రస్తుతం మంచి జోష్( Josh ) మీద ఉంది ఊర్వశి.ఇది ఇలా ఉంటే ఇటీవల తన పుట్టినరోజు వేడుకలను జరుపుకుంది ఊర్వశి.తన పుట్టినరోజు సందర్భంగా తన గొప్ప మనసును చాటుకుంది.ఆమె చేసిన గొప్ప పనికి ప్రేక్షకులు అభిమానులు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.ఇంతకీ ఆమె ఏమి చేసింది అంటే ఊర్వశి రౌతేలా ఫౌండేషన్ తరఫున అనాథలైన అమ్మాయిలకు సామూహిక వివాహాలు జరిపించింది.ఈ మహోన్నత కార్యక్రమానికి భారత ప్రధాని మోదీతో( Prime Minister Modi ) పాటు మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నూతన వధూ వరులకు ఆశీర్వదించారు.

దాదాపు 251 జంటలకు సామూహిక వివాహం జరిపించనట్లు ఊర్వశి రౌతేలా వెల్లడించారు.అంతేకాదు తానే స్వయంగా వారికి భోజనాలు కూడా వడ్డించి మరి గొప్ప మనసును చాటుకుంది.అయితే దీనికి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది.
ఇది చూసిన నెటిజన్స్ ఊర్వశి చేసిన పనికి అభినందనలు తెలియజేస్తున్నారు.అంతేకాకుండా ఊర్వశిపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.







