ఒకప్పటి స్టార్ హీరోయిజ్, దేవంగత నటి సౌందర్య( Actress Soundarya ) గురించి మనందరికీ తెలిసిందే.ఆమె భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ ఆమె జ్ఞాపకాలు మాత్రమే ఇంకా కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయి.ఆమె మరణించి కొన్ని ఏళ్ళు అవుతున్నా కూడా ఇప్పటికీ అభినయం మర్చిపోలేక పోతున్నారు అభిమానులు.1992లో ప్రారంభమైన సౌందర్య కెరీర్ 2004తో ముగిసింది.31 ఏళ్ళ అతి చిన్న వయసులో ఆమెను మృత్యువు కబళించింది.ఎంతో వైవిధ్యంగా సాగి, విషాదంగా ముగిసిన సౌందర్య సినీ, జీవిత విశేషాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కాగా సౌందర్య అసలు పేరు సౌమ్య.

1972 జూలై 18న కర్ణాటకలోని ములబాగళ్ లో కె.ఎస్.సత్యనారాయణ, మంజుల ( K.S.Satyanarayana, Manjula )దంపతులకు జన్మించారు.ఆమె మాతృభాష కన్నడ అయినప్పటికీ తెలుగు, తమిళ్ అనర్గళంగా మాట్లాడగలదట.తండ్రి కన్నడ చిత్ర పరిశ్రమలో రచయితగా, నిర్మాతగా ఉండేవారు.ఒక సినిమా ఫంక్షన్‌కి తండ్రితో కలిసి వెళ్లారు సౌందర్య.అక్కడ ఆమెను చూసిన కన్నడ సంగీత దర్శకుడు, రచయిత హంసలేఖ ( Hansalekha )తాను రచన చేస్తున్న గంధర్వ చిత్రంలో సెకండ్ హీరోయిన్ అవకాశం ఉందని సత్యనారాయణతో చెప్పారట.
అప్పుడు ఎంబిబిఎస్ చదువుతున్న సౌందర్య అయిష్టంగానే ఒప్పుకున్నారట.ఆ సినిమా చేసిన తర్వాత వరస అవకాశాలు రావడంతో చదువును మధ్యలోనే ఆపేశారు.

ఆ తర్వాత తెలుగులో మనవరాలి పెళ్లి చిత్రంలో( manavarali pelli ) హరీష్ సరసన హీరోయిన్‌గా నటించే ఛాన్స్ వచ్చింది.ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే మరిన్ని అవకాశాలు వచ్చాయట.అలా 1993లో తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో ఆమె నటించిన 10 సినిమాలు విడుదలయ్యాయి.అందులో 8 తెలుగు సినిమాలు కావడం విశేషం.ఇండస్ట్రీకి వచ్చిన సంవత్సరంలోనే హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్నారు సౌందర్య.తన 12 సంవత్సరాల సినీ కెరీర్ లో 100కి పైగా సినిమాల్లో నటించారు సౌందర్య.
ఆమె జీవించి ఉన్నప్పుడు రిలీజ్ అయిన చివరి సినిమా శ్వేతనాగు.అది ఆమె 100వ సినిమా కావడం గమనార్హం.
ఆమె మరణానంతరం కొన్ని సినిమాలు విడుదలు అయ్యాయి.తమిళ్, తెలుగు భాషల్లో ఘనవిజయం సాధించిన చంద్రముఖి కంటే ముందే అదే కథతో కన్నడలో సౌందర్య చేసిన ఆప్తమిత్ర ఆమె మరణించిన తర్వాతే రిలీజ్ అయింది.
అలాగే సౌందర్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రముఖ హీరోలందరి సరసన సౌందర్య నటించారు.తెలుగులో కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, జగపతిబాబు, మోహన్‌బాబు, రాజేంద్రప్రసాద్ వంటి స్టార్స్‌తో బ్లాక్‌బస్టర్ హిట్స్ చేసి మెప్పించింది.







