Alia Bhatt Pooja Bhatt: బాలీవుడ్ ఇంత దారుణమా ? అక్కనే తల్లిగా మార్చిన ఈ సంగతి మీకు తెలుసా?

బాలీవుడ్( Bollywood ) కుటుంబాల్లో చాలా దారుణంగా పరిస్థితులు ఉంటాయి.అక్కడ ప్రతి జీవితం ఒక నాటక రంగమే.

ప్రేమలు, పెళ్లిళ్లు, విడిపోవడాలు, వేరే పెళ్లి చేసుకోవడం లేదా అది కూడా విడిపోవడం ఈ విషయాలను అసలు పెద్దగా ఎవ్వరూ పట్టించుకోరు.ఒక్కొక్కరు ఎన్ని వివాహాలు చేసుకున్నారు ఎవరి ద్వారా పిల్లలని కన్నారు చివరికి ఎక్కడ సెటిల్ అయ్యారు అని తేల్చడం చాలా కష్టంగా ఉంటుంది ఇది ఎంత పెద్ద కుటుంబానికైనా అతీతం కాదు మహేష్ బట్( Mahesh Bhatt ) తన జీవితంలో రెండు సార్లు పెళ్లి చేసుకున్నాడు ఒక్కొక్కరితో ఇద్దరేసి పిల్లల్ని కన్నాడు అందువల్ల 40 ఏళ్ల పాటు పిల్లలకు అంటూనే ఉన్నాడు.

తద్వారా అది వారి పిల్లల జీవితాలపై కూడా చాలా ప్రభావాన్ని చూపింది అది ఏ విధంగా అనేది ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Telugu Alia Bhatt, Bollywood, Mahesh Bhatt, Maheshbhatt, Pooja Bhatt, Poojabhatt

మహేష్ బట్ మొదట కిరణ్ బట్టి అనే ఒక మహిళను పెళ్లి చేసుకోగా ఆమె ద్వారా రాహుల్ బట్, పూజ భట్ అనే ఇద్దరు పిల్లలకి జన్మనిచ్చాడు.ఇందులో పూజ( Pooja Bhatt ) హీరోయిన్ గా మన తెలుగు సినిమాల్లో కూడా నటించింది ప్రస్తుతం బాలీవుడ్ లో ఆమె బిజీగా ఉంది నిర్మాతగా హీరోయిన్ గా యాక్టివ్ గా ఉండే పూజా భట్ ఇటీవల బిగ్ బాస్ లో కూడా పాల్గొంది ఆమె 1972లో జన్మించగా విడిపోయిన మహేష్ నటి సోనీ రజ్దం నీ 1986 లో వివాహం చేసుకున్నాడు.వీరిద్దరికీ షాహిన్ భట్, ఆలియా భట్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

అయితే విచిత్రమైన విషయం ఏమిటంటే మహేష్ బట్టు మొదటి భార్య కుమార్తె పూజ భట్ రెండో భార్య కుమార్తె ఆలియా భట్( Alia Bhatt ) మధ్య దాదాపు 20 ఏళ్ల వయసు తేడా ఉంటుంది ఆలియా జన్మించడానికి ఐదేళ్ల ముందుగానే పూజ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

Telugu Alia Bhatt, Bollywood, Mahesh Bhatt, Maheshbhatt, Pooja Bhatt, Poojabhatt

కానీ ఇందాక చెప్పినట్టు బాలీవుడ్ అంటేనే ఒక నాటక రంగం వారి జీవితాలు ఎప్పుడు నాటకాలతోనే ముడి పడినట్టుగా ఉంటాయి.అందుకే ఒక వార్త అప్పటి నుంచి ఇప్పటివరకు వైరల్ అవుతూనే ఉంది 1993లో ఆలియా భట్ పుట్టిన రోజు నుంచి నేటి వరకు ఒక దారుణమైన వార్త వారి జీవితాలను ప్రభావితం చేస్తూనే ఉంది.అదేంటంటే పూజ భట్ కూతురే ఈ ఆలియా భట్ అని.20 ఏళ్ల గ్యాప్ ఉన్నంత మాత్రాన ఇద్దరు అక్కచెల్లెలను తల్లి కూతుర్లుగా మార్చేసింది బాలీవుడ్ మీడియా. అలా ఈ వార్తను విన్న ప్రతిసారి ఆలియా మరియు పూజ కుంగిపోతు ఉంటారట.

ఇది ఒక్కోసారి తమను ఎంతగా ప్రభావితం చేస్తుంది అంటే మరి ఇద్దరు కలిసి మాట్లాడుకోవడానికి కూడా భయపడతారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube