భారత సంతతికి చెందిన కెనడా మాజీ మంత్రి అనితా ఆనంద్( minister Anita Anand ) తన రాజకీయ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు.త్వరలో జరగనున్న కెనడా ఫెడరల్ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.
అయితే తాను రాజకీయాల్లో కొనసాగనని, తిరిగి బోధనా వృత్తిని ఎంచుకుంటానని గతంలో ఆమె చెప్పారు.అలాంటిది తిరిగి ఎన్నికల్లో పోటీ చేస్తానని అనిత చెప్పడం కెనడా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ( Donald Trump )కెనడాపై సుంకాలు విధిస్తానని బెదిరించడంతో పాటు ప్రస్తుత సంక్షోభం .ఎన్నికల్లో పోటీపై ఆమె పునరాలోచనకు కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.దేశం ప్రస్తుతం సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, ఇలాంటి పరిస్ధితుల్లో రాజకీయాల నుంచి నేను తప్పుకోలేనని దేశానికి సేవ చేయడానికి తదుపరి ఫెడరల్ ఎన్నికల్లో పోటీ చేస్తానని అనితా ఆనంద్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.మాజీ సెంట్రల్ బ్యాంకర్ మార్క్ కార్నీ తదుపరి కెనడా ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది.
శుక్రవారం సాయంత్రం కార్నీ తన ఓక్‌విల్లే రైడింగ్‌లో( Oakville ) జరిగిన కార్యక్రమంలో ఆనంద్‌తో కలిసి పాల్గొన్నారు.

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో( Canadian Prime Minister Justin Trudeau ) తన పదవికి రాజీనామా చేసిన తర్వాత అనితా ఆనంద్ ప్రధాని రేసులో నిలిచారు.కానీ అనూహ్యంగా ఆమె పోటీ నుంచి తప్పుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.తాను రాజకీయాల నుంచి నిష్క్రమించి విద్యారంగంలోకి తిరిగి వస్తానని జనవరి 11న ప్రకటించారు.
కానీ ఆలోపే తాను ఫెడరల్ ఎన్నికల్లో పోటీ చేస్తానని అనితా ఆనంద్ షాకిచ్చారు.షెడ్యూల్ ప్రకారం కెనడా ఫెడరల్ ఎన్నికలు ఈ ఏడాది అక్టోబర్‌లో జరగనున్నాయి.కానీ ఇవి ముందే వచ్చే అవకాశాలు లేకపోలేదు.

పంజాబీ తల్లికి, తమిళనాడు తండ్రికి కెనడాలో జన్మించారు అనితా ఆనంద్.ఇప్పటికీ వీరి బంధువులు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరులలో ఉన్నారు.అనిత తాతగారు భారత స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు.2019 ఓక్‌విల్లే నుంచి అనిత తొలిసారిగా కెనడా పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు.తొలుత ప్రజాసేవల మంత్రిగా, తర్వాత రక్షణ మంత్రిగా ఆమె సేవలందించారు.
గతేడాది రవాణా, అంతర్గత వాణిజ్య వ్యవహారాల మంత్రిగా అనితా ఆనంద్ బాధ్యతలు చేపట్టారు.







