బాలీవుడ్ ఇండస్ట్రీ దరిద్రానికి కారణాలివే.. స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్ వైరల్!

బాలీవుడ్ స్టార్ హీరోల గురించి అక్కడ తెరకెక్కే సినిమాల గురించి వాటి బడ్జెట్ల గురించి మనందరికీ తెలిసిందే.బాలీవుడ్ స్టార్ హీరోలు సినిమా బడ్జెట్ కి మించి పారితోషకాలు( Remuneration ) అందుకుంటారు అనే టాక్ ఎప్పటి నుంచో ఉంది.

 John Abraham Hits Out At High Entourage Cost Details, John Abraham, John Abraham-TeluguStop.com

అక్కడి స్టార్ హీరోలు అందరూ కూడా కోట్లలో పారితోషికాలు అందుకుంటారు.సినిమా నిర్మాతలు కూడా ఆ స్టార్ హీరోలకు ఉన్న క్రేజ్ చూసి పెద్ద మొత్తంలో ఆఫర్ చేస్తూ ఉంటారు అన్న విషయం కూడా తెలిసిందే.

అయితే ఇప్పుడు ఆ భారీ పారితోషికాలే బాలీవుడ్ కొంపముంచాయి అంటున్నాడు ఒక స్టార్ హీరో.

Telugu Bollywood, John Abraham, Johnabraham-Movie

బాలీవుడ్ కి చెందిన ఒక స్టార్ హీరో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.ఇంతకీ ఆ హీరో ఎవరు? ఆయన ఏం వ్యాఖ్యలు చేశారు అన్న విషయానికి వస్తే.బాలీవుడ్ స్టార్ హీరో అయినా జాన్ అబ్రహం( John Abraham ) గురించి మనందరికీ తెలిసిందే.

ఆయన ఎన్నో సినిమాలలో హీరోగా నటించడంతోపాటు పలు కమర్షియల్ యాడ్స్ లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ప్రస్తుతం వరస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్ అబ్రహం కు బాలీవుడ్ ఇండస్ట్రీ కి( Bollywood ) సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి.

Telugu Bollywood, John Abraham, Johnabraham-Movie

బాలీవుడ్ తారలు కొందరు రోజుకి కోట్లలో పారితోషికాలు డిమాండ్ చేస్తున్నారా అని అడగగా.జాన్ అబ్రహం స్పందిస్తూ.భారీ పారితోషికాలు అంటే నవ్వొస్తుంది.

ఆ భారీ రెమ్యునరేషన్స్ ఇప్పటికే బాలీవుడ్ మార్కెట్ ని దెబ్బతీశాయి.భారీ బడ్జెట్ పెట్టి తెరకెక్కించే సినిమాలపై నటుల భారీ పారితోషకాలు ఇంకాస్త ఒత్తిడిని పెంచుతున్నాయి.

అసలు అది వింటేనే హాస్యాస్పదంగా ఉంది.నటులు నిజంగానే డిమాండ్ చేస్తున్నారా లేదంటే ఏజెంట్స్ ఇలాంటివి వ్యాప్తి చేస్తున్నారా, నటులు డిమాండ్ చెయ్యడమే కాదు, కొంతమంది నిర్మాతలు ( Producers ) కూడా భారీగా నటులకు ఆశ చూపిస్తున్నారు.

ఎంతంటే అంత ఇవ్వడానికి రెడీగా ఉన్నారు.దాని వల్ల ఇండస్ట్రీకి నష్టమే కానీ లాభం ఉండదు.

ఒక నటుడిగా ఇలాంటివి వినడానికి బాధపడుతున్నా అంటూ పారితోషికాలపై జాన్ అబ్రహం రియాక్ట్ అయ్యారు.ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube