మధ్యప్రదేశ్‌లోని( Madhya Pradesh ) బేతూల్ జిల్లాలో( Betul District ) ఫిబ్రవరి 25న పరీక్ష సందర్భంగా సంచలన ఘటన చోటుచేసుకుంది.ఓ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయురాలు( Teacher ) విద్యార్థులకు పరీక్షల సమయంలో కాపీ( Copy ) కొట్టేలా సహాయపడటానికి పాల్పడ్డారు.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్( Viral ) కావడంతో ఆమెపై కఠిన చర్యలు తీసుకున్నారు.
వైరల్ వీడియోలో, ఉపాధ్యాయురాలు సంగీతా( Sangeetha ) పరీక్ష సమయంలో విద్యార్థులకు గణిత ప్రశ్నలకు సమాధానాలను బోర్డుపై వ్రాసి సూచనలు ఇస్తున్నట్లు స్పష్టమైంది.
ఇది విద్యా వ్యవస్థ పట్ల ప్రజల్లో ఆందోళన రేకెత్తించింది.కొంత మంది ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ, పరీక్షలలో అక్రమ కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.

ఈ ఘటనపై బేతూల్ జిల్లా కలెక్టర్ నరేంద్ర కుమార్ సూర్యవంశి తక్షణమే స్పందించి దీని గురించి సీరియస్‌గా దర్యాప్తు జరిపించాలని ఆదేశించారు.ప్రాథమిక విచారణ అనంతరం, పరీక్షా( Exams ) సమయంలో పరిశీలకురాలిగా ఉన్న ఆ ఉపాధ్యాయురాలు తన అధికారాన్ని దుర్వినియోగం చేసిందని నిర్ధారించడంతో, ఆమెను విధుల నుండి సస్పెండ్ చేశారు.

ఈ ఘటన విద్యా రంగంలో నైతిక విలువల క్షీణతకు నిదర్శనంగా మారింది.విద్యార్థులకు సముచితమైన విద్యను అందించాల్సిన ఉపాధ్యాయులే, ఇలా కాపీ కొట్టడానికి ప్రోత్సహించడం వంటి చర్యలకు పాల్పడడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.దీనిపై మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో చాలామంది ఆ టీచర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పిల్లలకు పాఠాలు బోధించడం మానేసి.ఇలాంటి ఘటనలు చేయడం వల్ల వారి భవిష్యత్తుకు గండి కొడుతున్నారని కొందరు కామెంట్ చేస్తుండగా.
మరి కొందరేమో ఎంతోమంది ఉపాధ్యాయులు మంచి పేరు వారి చేసిన సేవలు గుర్తించి మంచి పేరు తెచ్చుకుంటుంటే.మరికొందరు ఇలా చేయడం వల్ల ఉపాధ్యాయ వృత్తికి చెడ్డపేరు తెస్తున్నారంటూ కామెంట్ చేస్తున్నారు.