Bandi Movie Review: ఆదిత్య ఓం బందీ సినిమా రివ్యూ అండ్ రేటింగ్!

Bandi Movie Review: టాలీవుడ్ ఇండస్ట్రీలో లాహిరి లాహిరి లాహిరిలో, ఈ అమ్మాయి ఎవరో మాకు తెలియదు ధనలక్ష్మి ఐ లవ్ యు వంటి సినిమాలలో నటించి హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటుడు ఆదిత్య ఓం.( Aditya Om ) ఇలా నటుడుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈయన ఉన్నఫలంగా సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు.

 Aditya Om Bandi Movie Review And Rating-TeluguStop.com

ఇక ఇటీవల బిగ్ బాస్ సీజన్ 8 కార్యక్రమంలో కంటెస్టెంట్ గా కూడా పాల్గొన్న విషయం తెలిసిందే.ఇలా బిగ్ బాస్ తర్వాత తిరిగి ఈయన కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.

తాజాగా బందీ( Bandi Movie ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంది ఈ సినిమా కథ ఏంటి అనే విషయానికి వస్తే…

కథ:

ఆదిత్య ఓం ఈ సినిమాలో ఒక కార్పొరేట్ లాయర్ గా పనిచేస్తూ ఉంటారు.ఇక ఈయనకు కేసు వాదించడానికి పెద్ద ఆఫర్ వస్తుంది.ఈయన ఒక అడవిని పూర్తిగా తొలగించి ఆ ప్రాంతంలో ఫ్యాక్టరీ నిర్మించడం కోసం ఆ కార్పొరేట్ కంపెనీ తరఫున వాదిస్తూ ఉంటారు.

ఇక ఈ కేసు కోర్టులో నడుస్తూ ఉండగానే ఈయన కిడ్నాప్ కి గురి అవుతారు అయితే ఏ అడవిని తొలగించాలని అయితే ఆదిత్య కేసు వాదిస్తూ ఉంటారు.అదే అడివిలోనే ఈయన ప్రత్యక్షమవుతారు.

Telugu Aditya Om, Aditya Om Bandi, Adityaom, Bandi, Bandi Review, Tollywood-Movi

ఇక ఈ అడివిలో ఎవరు కూడా తనకు కనిపించరు కనీసం బయట వ్యక్తులతో ఏదైనా మాట్లాడాలి అన్న తనకు అలాంటి అవకాశం లేదు.కేవలం కిడ్నాపర్లతో మాట్లాడటానికి మాత్రమే వాకీ టాకీని ఉపయోగిస్తూ ఉంటారు.మరి ఇలా అడివిలో చిక్కుకున్న అతను అడవి నుంచి బయటకు ఎలా వస్తారు? బయటకు వచ్చిన తర్వాత ఆ కేసును వాదించి అడవిని తొలగించేస్తారా? ఆ ప్రాంతంలో ఫ్యాక్టరీ నిర్మిస్తారా? అనేది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

నటినటుల నటన:

ఇందులో కథ మొత్తం హీరో ఆదిత్య ఓం చుట్టూనే తిరుగుతుంది ఇందులో ఈయన సింగిల్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారనే చెప్పాలి.

Telugu Aditya Om, Aditya Om Bandi, Adityaom, Bandi, Bandi Review, Tollywood-Movi

టెక్నికల్:

మధుసుదన్ కోట( Madhusudan Kota ) సినిమాటోగ్రఫీ, చాలా ప్లస్ అయ్యింది.వీరల్-లవన్, సుదేశ్ సావంత్ ఇచ్చిన మ్యూజిక్, సినిమాకి చక్కగా ఉపయోగపడింది.ఇక ఆదిత్య నటన కూడా అద్భుతంగా ఉందని చెప్పాలి.ఇక డైరెక్టర్ తిరుమల రఘు( Director Tirumala Raghu ) కూడా చిత్రాన్ని ఎంతో అద్భుతంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.ఇక నిర్మాణాత్మక విలువలు కూడా బాగున్నాయి.

విశ్లేషణ:

ఇలాంటి సర్వైవల్ థ్రిల్లర్స్ హాలీవుడ్‌లో చాలా వచ్చాయి.అయితే తెలుగులో ఇలాంటి సినిమా రావడం ఇదే తొలిసారి అని చెప్పుకొవచ్చు.ఈ సినిమా కోసం ఆదిత్య ఏకంగా నాలుగు సంవత్సరాలు పాటు కష్టపడి నటించారు.ఎండ, గాలి, నీరు, భూమి, వర్షం. ఇలా ప్రకృతి, మనిషి మీద పగబడితే, ఎలాంటి విపత్తులు వస్తాయి? అడవులను నరికితే, వాతావరణంలో ఎలాంటి మార్పులు జరుగుతాయనే ఆలోచనను డైరెక్టర్ చక్కగా చూపించారు.ఓవరాల్‌గా సర్వైవల్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ఆదిత్య ఓం ‘బందీ’ మూవీ ఓ మంచి అనుభూతిని అందిస్తుంది.నాలుగు సంవత్సరాలు ఈ సినిమా కోసం కష్టపడి చేశారు కానీ కాస్త ప్రమోషన్స్ కనక చేసి ఉంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేదని చెప్పాలి

రేటింగ్:3/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube