టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ( Virat Kohli ) క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.భారత్‌లోనే కాకుండా, దాయాది దేశం పాకిస్థాన్‌లోనూ( Pakistan ) అతనికి విపరీతమైన అభిమానులు ఉన్నారు.
ముఖ్యంగా పాకిస్థాన్ యువతలో కోహ్లీ పట్ల ఉన్న ప్రేమ, అభిమానం రోజురోజుకూ పెరుగుతోంది.తాజాగా ఈ విషయాన్ని మరోసారి నిరూపించేలా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్( Viral Video ) అవుతోంది.2025లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ( Champions Trophy ) పాకిస్థాన్ వేదికగా జరుగుతుండడంతో, అక్కడి యువకులు కోహ్లీపై తమ అభిమానాన్ని తెగ ప్రదర్శిస్తున్నారు.ఇటీవల పాకిస్థాన్ స్టేడియాల్లో కోహ్లీ పేరుతో ఉన్న జెర్సీలను ధరించి సందడి చేసిన అభిమానులు, మ్యాచ్‌ల సమయంలో కోహ్లీ పేరు ఆరాధన చేస్తూ హోరెత్తించారు.
ఇది కోహ్లీ పట్ల ఉన్న ప్రేమను, అభిమానాన్ని మరోసారి స్పష్టం చేసింది.
ఇందులో భాగంగా, తాజాగా ఓ పాకిస్థాన్ అభిమాని కోహ్లీ అంటే తనకెంత ఇష్టమో అర్థమయ్యేలా ఓ వినూత్న రీతిలో తన అభిమానాన్ని చూపించాడు.తన బైక్‌పై 18 నెంబర్‌తో విరాట్ పేరు ఉన్న స్టిక్కర్‌ను అతికించుకుని, కోహ్లీ పేరుతో రోడ్లపై బైక్ రైడ్ చేస్తున్నాడు.‘నా బైక్ మీదే కాదు, నా కారుపై కూడా విరాట్ పేరే ఉంది.అంతేకాదు, నా గుండెల్లోనూ అతడే ఉన్నాడు’ అని ఆ అభిమాని భావోద్వేగంగా చెప్పుకొచ్చాడు.“మిమ్మల్ని ఎవరైనా కోహ్లీ పేరును ఎందుకు పెట్టారు అని ప్రశ్నించారా?” అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.అతను ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు.
తాను రోడ్లపై విరాట్ పేరుతో బైక్ నడుపుతుంటే చాలా మంది ఆసక్తిగా చూస్తుంటారు.కొంతమంది నా దగ్గరికి వచ్చి ఫొటోలు తీసుకుంటారు.దేవుడు మీద ఒట్టేసి చెబుతున్నా, అది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది.
అయితే కొంతమంది మాత్రం విరాట్ పేరు ఎందుకు పెట్టావని అడుగుతారని చెప్పారు.ఈ ఘటన కోహ్లీ క్రేజ్‌ను మరోసారి నిరూపించిందని చెప్పొచ్చు.
ప్రత్యర్థి దేశంలో కూడా ఈ స్థాయిలో అభిమానాన్ని సొంతం చేసుకోవడం నిజంగా విశేషమే.కోహ్లీ ఆట, అతని నిబద్ధత, అంకితభావం మూడింటినీ చూస్తే, ఎందుకు ఇంతమంది అభిమానులున్నారో అర్థమవుతుంది.