ఈ రోజుల్లో యువతులు తమ భవిష్యత్తు గురించి కొత్త కొత్త ఆలోచనతో ముందుకు సాగుతున్నారు.ఉద్యోగ భద్రత, భవిష్యత్ స్థిరత్వం అనే అంశాలను ప్రాధాన్యతగా తీసుకుంటూ, తమ జీవిత భాగస్వామిని( Life Partner ) కూడా అదే ప్రామాణికతతో ఎంచుకోవాలని భావిస్తున్నారు.
లక్షల రూపాయలు వచ్చే ప్రైవేట్ ఉద్యోగాల కంటే, స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగం( Government Job ) ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోవడమే ఉత్తమం అనే అభిప్రాయాన్ని చాలా మంది యువతులు వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయాన్ని ఇటీవల ఓ యువతి వినూత్నంగా ప్రదర్శించడంతో ఆమె వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్( Viral Video ) అయింది.
తనకు ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వ్యక్తే కావాలంటూ ఓ యువతి( Lady ) ఏకంగా ఓ పోస్టర్ పట్టుకుని రోడ్డు మీద కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది.పెళ్లికూతురిలా ముస్తాబై, “సర్కారు నౌకరీ ఉన్న అబ్బాయి కోసం చూస్తున్నాను” అంటూ పెద్ద పోస్టర్ పట్టుకుని రోడ్డు మీదకు వచ్చిన ఈ యువతి, ఎదురుగా వచ్చే యువకులను అడుగుతూ కనిపించింది.“మీకు ప్రభుత్వ ఉద్యోగం ఉందా?” అని ప్రశ్నిస్తూ, ప్రైవేట్ ఉద్యోగం ఉన్న వారిని రిజెక్ట్ చేస్తూ, చివరికి ఓ ప్రభుత్వ ఉద్యోగం ఉన్న యువకుడికి ఒప్పుకోవడం మరింత ఆసక్తికరంగా మారింది.ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, చర్చనీయాంశంగా మారింది.
నేటి యువతులు ఉద్యోగ భద్రతకు( Job Security ) అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.తక్కువ జీతం వచ్చినా ఫర్వాలేదు కానీ.భవిష్యత్‌లో ఎలాంటి ఆర్థిక ఒత్తిడి లేకుండా జీవించాలన్న ఆలోచన పెరిగింది.కేవలం కష్టపడి పని చేయడమే కాదు, జీవితంలో స్థిరత్వం, భద్రత ఉండాలని భావిస్తూ ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వారికే ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఈ యువతి వీడియో ద్వారా ఈ అభిప్రాయమే బయటపడింది.ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.“ఇందంతా స్క్రిప్టెడ్ వీడియో.బాగానే చేశారని” కొందరు కామెంట్ చేస్తుండగా.
ఇలాంటి అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం కంటే, ఒంటరిగా ఉండడమే మేలని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.మొత్తంగా ఈ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
యువతుల ఆలోచనా విధానం ఎలా మారిందో చూపించే విధంగా ఈ ఘటన నిలిచింది.అయితే, ప్రతి ఒక్కరి అభిప్రాయం వ్యక్తిగతమైనదే.
కానీ, ఈ వీడియో ద్వారా ఒక ఆసక్తికరమైన చర్చ మాత్రం తెరపైకి వచ్చింది.