అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి దూకుడుగా రాజకీయాలు చేస్తూ, నిర్ణయాలు తీసుకుంటున్నారు డొనాల్డ్ ట్రంప్.( President Donald Trump ) ఇక విదేశీయులకు పుట్టే పిల్లలకు జన్మత: అమెరికా పౌరసత్వం ఇవ్వడాన్ని కూడా నిషేధిస్తూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు.అయితే కోర్టులు కలగజేసుకుని దానిని తాత్కాలికంగా నిలుపుదల చేశాయి.కానీ ట్రంప్ దూకుడు చూస్తే తగ్గేలా కనిపించడం లేదు.అలాగే అమెరికాలో( America ) అక్రమంగా నివసిస్తున్న విదేశీయులను దేశం నుంచి బహిష్కరిస్తున్నారు ట్రంప్.ఈ లిస్ట్‌లో భారతీయులు కూడా ఉన్నారు.
ప్రభుత్వ వ్యయాలు తగ్గించే ప్రణాళికల అమలును వేగవంతం చేసిన ట్రంప్ పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగులను( Federal Workers ) తొలగిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే వేలాది మందిపై వేటుపడగా.
వీరంతా దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.అయితే ఉద్యోగుల తొలగింపుపై అమెరికాలోని కార్మిక సంఘాలు మండిపడుతున్నారు.
అక్కడితో ఆగకుండా ట్రంప్ నిర్ణయంపై వారు కోర్టులను ఆశ్రయిస్తున్నారు.దీనిపై విచారణ జరిపిన యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి విలియం అల్సప్.
ట్రంప్‌కు షాకిచ్చారు.

అధ్యక్షుడి నిర్ణయాలను నిలిపివేస్తూ ఆయన ఆదేశాలు జారీ చేశారు.పర్సనల్ మేనేజ్‌మెంట్ కార్యాలయానికి ఉద్యోగులను తొలగించే అధికారాలు లేవని న్యాయమూర్తి తేల్చిచెప్పారు.తమ విభాగాల్లో సిబ్బందిని నియమించుకోవడానికి, తొలగించుకోవడానికి ఫెడరల్ ఏజెన్సీలకు కాంగ్రెస్ అధికారం కల్పించిందని.
ఉద్యోగుల తొలగింపు అనేది చట్ట వ్యతిరేకమని జస్టిస్ విలియం అల్సప్ పేర్కొన్నారు.న్యాయస్థానం ఆదేశాలతో ఇప్పటికే ఉద్యోగాల్లోంచి తీసివేయబడ్డవారు.
మెడపై కత్తి వేలాడుతున్న వారికి ఉపశమనం దక్కినట్లయ్యింది.

కాగా.ఫెడరల్ ఏజెన్సీలలోని దాదాపు 2 లక్షల మంది ఉద్యోగుల్లో పలువురిని తొలగించాలని టెస్లా అధినేత ఎలాన్ మస్క్( Elon Musk ) సారథ్యంలోని డోజ్( DOGE ) సిఫారసు చేసింది.దీనికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదముద్ర వేయడంతో తొలగింపు ప్రక్రియ వేగంగా జరుగుతోంది.
ఇప్పుడు కోర్టు మొట్టికాయల నేపథ్యంలో ఈ ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.