డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ( Lokesh Kanagaraj ) దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ ( Rajinikanth ) నటించిన తాజా చిత్రం కూలీ( Coolie ).ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి కావస్తుంది.
లోకేష్ డైరెక్షన్ అంటే ఇటీవల కాలంలో సినిమాలపై భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోతున్నాయి ఈ క్రమంలోనే రజినీకాంత్ కూలీ సినిమాపై కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన అయిన పోస్టర్స్, వీడియో గ్లింప్స్ ప్రేక్షకులలో భారీ అంచనాలను పెంచేసాయి.
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఇటీవల కాలంలో ప్రతి ఒక్క సినిమాలో కూడా స్పెషల్ సాంగ్( Special Song ) ఉండేలా మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే కూలి సినిమాలో కూడా లోకేష్ ఒక స్పెషల్ సాంగ్ పెట్టబోతున్నారని తెలుస్తోంది.సిజ్లింగ్ సాంగ్‌గా రానున్న ఈ పాటలో బుట్ట బొమ్మ పూజా హెగ్డే( Pooja Hegde ) స్టెప్పులు వేయబోతున్నారని తెలుస్తుంది.
ఇలా పూజా హెగ్డే రజనీకాంత్ సినిమాలో స్పెషల్ సాంగ్ సందడి చేయటం కోసం కళ్ళు చెదిరే రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకున్నట్టు తెలుస్తుంది.

ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడం కోసం పూజా హెగ్డే ఏకంగా రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్టు సమాచారం.అయితే ఈమె అడిగినది ఇవ్వటానికి మేకర్స్ కూడా సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.ఏది ఏమైనా మరోసారి పూజ హెగ్డే స్పెషల్ సాంగ్లో మెరబోతున్నారు.
ఇదివరకే ఈమె రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రంగస్థలం సినిమాలో జిగేలురాణి అంటూ కుర్రకారులను సందడి చేసిన విషయం మనకు తెలిసిందే.

గత కొద్ది రోజులుగా ఏ విధమైనటువంటి సినిమా అవకాశాలు లేకుండా పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న పూజ హెగ్డే తిరిగి తన కెరీర్ లో ఎంతో బిజీ అవుతున్నారు.ఇప్పుడిప్పుడే ఈమె వరస సినిమాలకు కమిట్ అవ్వడమే కాకుండా మరోవైపు ఇలా స్పెషల్ సాంగ్స్ కి కూడా కమిట్ అవుతూ కెరియర్ ను ట్రాక్ లో పెట్టుకుంటున్నారని తెలుస్తోంది.