పవన్ కళ్యాణ్ నాకు స్ఫూర్తి... దిల్ రాజు ఎమోషనల్ కామెంట్స్!

సినీ నటుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై( Pawan Kalyan ) ప్రముఖ నిర్మాత దిల్ రాజు ( Dil Raju ) ఎమోషనల్ కామెంట్స్ చేశారు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరంగా రాజకీయాలలో బిజీ అవుతున్న సంగతి మనకు తెలిసిందే.

 Pawan Kalyan Is My Inspiration Dil Raju Emotional Comments Details, Dil Raju, Pa-TeluguStop.com

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న ఈయన రాజకీయాలపై ఆసక్తితో రాజకీయాలలో వచ్చి ఇక్కడ ఎన్నో అవమానాలను కష్టాలను ఎదుర్కొంటూ నేడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నారు.ఇక ఈయన కష్టం ఎంతోమందికి ఆదర్శమని చెప్పాలి.

ఈ క్రమంలోనే నిర్మాత దిల్ రాజు సైతం పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Telugu Apdeputy, Dil Raju, Pawan Kalyan, Pawankalyan, Tollywood-Movie

ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ నాకు పవన్ కళ్యాణ్ గత పాతిక సంవత్సరాల నుంచి తెలుసని వెల్లడించారు.తొలిప్రేమ( Tholi Prema ) నుంచే చాలా సన్నిహితంగా ఉంటానని చెప్పారు.అయితే పవన్ కళ్యాణ్ అప్పటి నుంచే పొలిటికల్ వైపు వ్యూహాలు రచించే వారంట.

పవన్ నటించిన గబ్బర్ సింగ్( Gabbar Singh ) సినిమా సమయంలో ఆయన సినీ కెరియర్ మంచి పీక్ స్టేజ్లో ఉంది ఆ సమయంలోనే ఈయన రాజకీయాల పరంగా పార్టీ కార్యకలాపాలను ప్రారంభించారు.ఇలా పవన్ రాజకీయాల వైపు అడుగులు వేయటంతో చాలామంది సినీ పెద్దలు మంచి కెరియర్ ఉంది రాజకీయాలు అవసరమా అంటూ కూడా తిట్టిపోశారు.

Telugu Apdeputy, Dil Raju, Pawan Kalyan, Pawankalyan, Tollywood-Movie

ఎంతమంది వద్దని వారించిన పవన్ కళ్యాణ్ మాత్రం ఎవరి మాట వినకుండా పట్టు వదలని విక్రమార్కుడిలా రాజకీయాలలో( Politics ) కి వచ్చి ఎన్నికలలో నిలబడి ఓటమిపాలు అయ్యారు.ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు అయినప్పటికీ ఈయన మాత్రం మరోసారి తన పంజా విసురుతో అనుకున్న లక్ష్యాన్ని చేరారని నేడు ఉన్నత హోదాలో ఉన్నారని తెలిపారు.ఆయన పొలిటికల్ జర్నీ తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందన్నారు.జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా.ఆగకుండా ముందుకు వెళ్లాలని పవన్ కళ్యాణ్ జీవితాన్ని తలుచుకుంటే ఎనర్జీ వచ్చేస్తుందని చెప్పుకొచ్చారు.తన జీవితం డౌన్ అవుతుంటే నేను పవన్ కళ్యాణ్ ని ఆయన పడిన కష్టాన్ని తలుచుకొని తిరిగి పైకి లేస్తాను అంటూ దిల్ రాజు పవన్ పై ప్రశంసలు కురిపించారు.

ఇలా ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారడంతో ఉన్నఫలంగా దిల్ రాజు పవన్ కళ్యాణ్ గురించి ఇలా మాట్లాడటానికి కారణం ఏంటి అంటూ కూడా ఆరా తీస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube