తెలుగు సినిమా ఇండస్ట్రీలో దాదాపు 45 సంవత్సరాల నుంచి తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఏకైక హీరో చిరంజీవి(Chiranjeevi) మెగా స్టార్ గా ఎనలేని గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఆయన లాంటి హీరో మరొకరు ఉండరు అనేంతలా పేరు ప్రఖ్యాతలను కూడా సంపాదించుకున్నాడు.ఇక ప్రస్తుతం ఆయన వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర(Vishvambhara) అనే సినిమా చేస్తున్నాడు.
అయితే ఈ సినిమాలో వినూత్నమైన నటనను కనబరచబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.
ఇక ఇప్పటికే ఆయన నుంచి చాలా సినిమాలు వచ్చినప్పటికీ ఇందులో అంతకుమించి తన నట విశ్వరూపం చూపించే ఒక పవర్ ఫుల్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టుగా తెలుస్తోంది.
అయితే ఈ సినిమా సంక్రాంతికి (Sankranti)రావాల్సింది.కానీ గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారనే నేపథ్యంలో ఈ సినిమాని సమ్మర్ కి పోస్ట్ పోన్ చేశారు.
ఇక ఏది ఏమైనా కూడా చిరంజీవి సినిమా ఎప్పుడు వచ్చిన ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది.సినిమా సక్సెస్ అయితే భారీ రికార్డులను కూడా క్రియేట్ చేస్తుంది.
ఈయన సినిమాలు ఎప్పుడు వచ్చినా ఆ సినిమాలకు ఒక మంచి ఆదరణ అయితే దక్కుతుంది.ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఈ స్టార్ హీరో మొత్తానికైతే ఒక భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఇక దానికి తగ్గట్టుగానే ఇప్పుడు పాన్ ఇండియా సినిమాతో మరోసారి ప్రేక్షకులను మైమరిపింప చేయడానికి సిద్ధమవుతున్నాడు.అయితే ఈ సినిమాలో చిరంజీవి త్రిబుల్ రోల్ (Chiranjeevi’s triple role)లో నటించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయాలు తెలియవు కానీ ఆయన త్రిబుల్ రోల్ లో నటిస్తే మాత్రం సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…