నదిలో పడిపోయిన యజమాని.. నది ఒడ్డునే 4-రోజులు వెయిట్ చేసిన కుక్క.. ఎక్కడంటే..?

“కుక్క మనిషికి మంచి స్నేహితుడు” అనే సామెత ఎంత నిజమో బెల్కా అనే కుక్క కథ నిరూపిస్తోంది.తన యజమాని మరణించిన ప్రదేశం నుంచి కదలకుండా కూర్చున్న బెల్కా కథ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలామందిని కదిలించింది.

 The Owner Who Fell In The River.. The Dog That Waited For 4 Days On The River Ba-TeluguStop.com

రష్యాలో(Russia) 59 ఏళ్ల వయసు గల ఒక వ్యక్తి గడ్డకట్టిన ఉఫా నది ఒడ్డున సైకిల్ తొక్కేటప్పుడు ఈ విషాద సంఘటన జరిగింది.అనుకోకుండా మంచు విరిగిపోయి, ఆయన చల్లటి నీటిలో పడిపోయారు.

ఒక వ్యక్తి ఆయన్ని రక్షించడానికి ప్రయత్నించినప్పటికీ, నదిలోని బలమైన ప్రవాహం ఆయన్ని లాకెళ్లింది.అనేక రోజుల శోధన తర్వాత రక్షణ బృందాలు ఆయన శవాన్ని ఉఫా నదిలో(Ufa River) కింది భాగంలో కనుగొన్నారు.

బెల్కా డాగ్ (Belka Dog)మాత్రం ఆ ముసలాయన పడిపోయిన చోటు నుంచి కదల్లేదు అతను తిరిగి వస్తాడేమో అని వెయిట్ చేస్తూ ఉంది.నాలుగు రోజుల పాటు తన యజమాని తిరిగి వస్తాడనే ఆశతో నది ఒడ్డున కూర్చుంది.

యజమాని కుటుంబం దానిని ఇంటికి తీసుకెళ్లినా, బెల్కా మళ్లీ అదే చోటుకు వెళ్లేది.దాని ప్రవర్తన చాలామందిని ఎంతగానో కదిలించింది.

@brutamerica అనే ఇన్‌స్టాగ్రామ్(instagram) అకౌంట్‌లో బెల్కా కథను పంచుకున్నారు.ఆ పోస్ట్‌లో, “రష్యాకు చెందిన బెల్కా అనే కుక్క తన యజమాని మంచులో పడి మునిగిపోయిన చోట నాలుగు రోజులు వేచి ఉంది, అతను తిరిగి వస్తాడని ఆశతో” అని రాశారు.

ఈ పోస్ట్‌కు దాదాపు 14,000 లైక్‌లు వచ్చాయి, వేలాది మంది కామెంట్‌లలో తమ భావోద్వేగాలను వ్యక్తం చేశారు.ఒక యూజర్, “మనం వాటిని పొందెంత అర్హులం కాదు; అవి అన్ని విధాలా ఉన్నతమైనవి” అని రాశారు.

చాలామంది బెల్కాపై తమ ప్రేమను హార్ట్ ఎమోజీలతో పంచుకున్నారు.

ఈ కథ, భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మరో సంఘటనను గుర్తు చేస్తుంది.ఒక కుక్క తన యజమాని గోదావరి నదిలో దూకి మరణించిన తర్వాత ఒక వంతెనపై తన యజమాని కోసం ఎదురు చూసింది.ఈ కథలు జపాన్‌కు చెందిన హచికో అనే కుక్క కథను గుర్తు చేస్తాయి.

హచికో తన యజమాని తిరిగి వస్తాడనే ఆశతో తొమ్మిది సంవత్సరాలు ఎదురు చూసిన కుక్క.ఇలాంటి కథలు కుక్కల అపారమైన విశ్వాసాన్ని ప్రదర్శిస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube