ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.34
సూర్యాస్తమయం: సాయంత్రం 05.36
రాహుకాలం: సా.4.30 ల6.00 వరకు
అమృత ఘడియలు: ఉ.6.00 ల7.00 సా.ద్వాదశి వరకు
దుర్ముహూర్తం:సా.5.02 ల5.53 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈరోజు మీకు పరిస్థితులు అనుకూలంగా ఉండవు.మీలో కాస్త బద్ధకం ఉంటుంది.స్నేహితులతో కలిసి బయటి సమయాన్ని ఎక్కువగా గడుపుతారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు చేస్తారు.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యా అవకాశం ఉంది.
వృషభం:

ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం మంచిది.ఆర్థికపరమైన విషయాలలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.భూమికి సంబంధించిన విషయాల్లో మీరు తలతీర్చకుండా ఉండడమే మంచిది.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
మిథునం:

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.
కర్కాటకం:

ఈరోజు మీరు ప్రారంభించిన వ్యాపారాల్లో పెట్టుబడి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి.కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు.తోపుదువులతో కలిసి కొన్ని దూరపు ప్రయాణాలు చేస్తారు.మీ విలువైన సమయాన్ని అనవసరంగా వృధా చేయకండి.
సింహం:

ఈరోజు విద్యార్థులు విదేశాల్లో చదవాలననే ఆలోచనలు ఉంటారు.మీరు చేసే చిన్న చిన్న పొరపాటుల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.స్నేహితుల వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.తొందరపడి ఈరోజు మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.
కన్య:

ఈరోజు మీరు చేసే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం ఉంది.మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.దూర ప్రయాణాలు చేసేటప్పుడు విలువైన వస్తువులను కాపాడుకోవాలి.ఈరోజు మీకు బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి
తులా:

ఈరోజు మీరు ఆరోగ్య సమస్యతో సతమతమవుతారు.ప్రారంభించిన పనుల్లో అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది.తొందరపాటు నిర్ణయాలు ఈరోజు మీకు పనికిరావు.మీరు చేసే పనిలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.
వృశ్చికం:

ఈరోజు మీరు భవిష్యత్తులో నుండి మంచి లాభాలను పొందుతారు.కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.అనుకోని చోటు నుండి ఆహ్వానాలు అందుతాయి.చాలా సంతోషంగా ఉంటారు.
ధనస్సు:

ఈరోజు మీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది.ఈరోజు మీరు కొన్ని పనులు స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు.మరోవైపు ఇంటికి సంబంధించిన పనులు బయట పనుల వలన తీరికలేని సమయంతో గడుపుతారు.నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.
మకరం:

ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది.దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుతాయి.మరోవైపు కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.భూమికి సంబంధించిన విషయాల్లో మీరు జోక్యం చేసుకోకుండా ఉండడమే మంచిది.
కుంభం:

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఈరోజు ఆరోగ్యం కుదుటపడుతుంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.
మీనం:

ఈరోజు మీకు చాలా కాలంగా ఉన్న సమస్యలకు పరిష్కారాన్ని కనుకొంటారు.ఈరోజు ఏదైనా పనిని చాలా సమర్థవంతంగా శాంతియుతంగా పరిష్కరించుకోగలుగుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.
DEVOTIONAL