సనాతన ధర్మంలో మహా శివరాత్రికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఈ రోజు పరమాశివుడిని పూజించడం వల్ల ఎన్నో పుణ్యఫలాలు లభిస్తాయి.
శివయ్య భక్తులు సంవత్సరం పాటు మహా శివరాత్రి కోసం ఎదురు చూస్తూ ఉంటారు.మహాశివరాత్రి రోజున చేసే పూజలు, ఉపవాసం, జాగారం భక్తుడి కష్టాలు రెప్పపాటుతో తొలగిపోతాయని చాలామంది భక్తులు నమ్ముతారు.
మహాశివరాత్రి రోజు ఇలా పూజలు చేయడం వల్ల సుఖసంతోషాలను కూడా పొందుతారని చెబుతారు.ఈ సంవత్సరం మహాశివరాత్రి ఫిబ్రవరి 18వ తేదీన దేశవ్యాప్తంగా జరుపుకుంటారు.తెలుగు పంచాంగం ప్రకారం మహాశివరాత్రి తో పాటు శని ప్రదోషం, వాశి యోగం, సన్ఫ యోగం, శంఖ యోగం, సర్వార్థ సిద్ధి యోగం కలిసి వస్తున్నాయి.ఈ శుభ యోగాలలో చేసే పూజ పారాయణ పనులు అనేక రెట్లు పలితాలను ఇస్తాయి.

దీని వల్ల మహాశివరాత్రికి మతపరమైన ప్రాముఖ్యత తో పాటు జ్యోతిష శాస్త్ర ప్రాముఖ్యత కూడా ఎంతో ఉంది.మహాశివరాత్రి రోజున శని కాలసర్ప దోష నివారణ కోసం పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ జాతకంలో శని దోషం వల్ల మీరు కష్టాలు ఎదుర్కొంటున్నట్లయితే నివారణ కోసం మహాశివరాత్రి రోజున శివయ్య పూజించడం వల్ల సమస్యలు దూరమైపోతాయి.

శివయ్య పూజలో బిల్వపత్రాన్ని సమర్పించి మహా మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే ఆ వ్యక్తికి శని దోషం వల్ల కలిగే దుష్ప్రభావాలు దూరం అయిపోతాయని చెబుతూ ఉంటారు.మహాశివరాత్రి రోజు శనికి సంబంధించిన దోషం తొలగించడానికి ముఖ్యంగా శివునికి రుద్రాభిషేకం చేయాలి.రుద్రాభిషేకం చేసే వీలు లేకపోతే రుద్రాక్ష జపమాలతో శివ సహస్రనామం లేదా శివ పంచాక్షరి మంత్రాన్ని జపించడం మంచిది.
సనాతన సంప్రదాయంలో ఎవరి జాతకంలోనైనా కాలసర్పదోషం ఉంటే వారి జీవితంలో కష్టాలు ఎదురవుతూ ఉంటాయి.జీవితంలో అభివృద్ధి నిలిచిపోతే మహాశివరాత్రి రోజున శివుడిని ఆరాధించడం ఎంతో మంచిది.