రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్.ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
ఇలా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.ఇప్పటికే ఈ సినిమాలోని నాటు నాటు పాటకు గాను గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడమే కాకుండా ఆస్కార్ నామినేషన్ లో నిలిచిన విషయం మనకు తెలిసిందే.
ఇక ఈ సినిమాపై ఎంతోమంది హాలీవుడ్ హీరోలు దర్శకులు స్పందిస్తూ పెద్ద ఎత్తున సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.

ఇకపోతే తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా గురించి మరొక హాలీవుడ్ నటుడు స్పందిస్తూ ఈ సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్ నటన పై ప్రశంసలు కురిపించారు.యాంట్ మ్యాన్ అండ్ ది వాస్ప్ః క్వాన్టుమేనియా` మూవీ స్టార్ జోనాథన్ మేజర్స్ ఎన్టీఆర్ రామ్ చరణ్ నటనపై ప్రశంసల వర్షం కురిపించారు.యాంట్ మ్యాన్ అండ్ ది వాస్ప్ః క్వాన్టుమేనియా సినిమా ఈనెల 17వ తేదీ ఇండియాలో విడుదల కానుంది.
ఈ క్రమంలోని ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి ఈయన RRR సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.

తాను భారతీయ సినిమాలకు పెద్ద అభిమానినని తెలిపారు. RRR సినిమా చూశానని ఒక్కసారి కాకుండా ఈ సినిమాను చాలా సార్లు తాను చూసానని తెలిపారు.ఎన్టీఆర్ రామ్ చరణ్ నటన అద్భుతమని ఇద్దరి హీరోలను తెరపై చూడటం చాలా అద్భుతంగా అనిపించిందని వెల్లడించారు.
ఇలా హాలీవుడ్ హీరో తెలుగు సినిమా గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాలకు మరింత క్రేజ్ పెరిగిపోతుందని చెప్పాలి.ఏది ఏమైనా RRR సినిమా గురించి హాలీవుడ్ నటుడు జోనాథన్ మేజర్స్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.