తెలంగాణలోని దళితబంధు పథకం యావత్ దేశానికే దిక్సూచిగా నిలుస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు.రైతు బీమా తరహాలో గీతన్నలకు బీమా ఇస్తున్నామని చెప్పారు.నేతన్నలకు రూ.5 లక్షల బీమా ఇస్తున్నామని తెలిపారు.
దివ్యాంగుల పెన్షన్ ను రూ.4,016 కు పెంచామని కేసీఆర్ పేర్కొన్నారు.చుక్క నీటికి అల్లాడిన తెలంగాణ నేడు 20కి పైగా రిజర్వాయర్లతో పూర్ణ కలశంగా మారిందని చెప్పారు.అటు ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేశామన్నారు.కొన్ని శక్తులు ఆర్టీసీ బిల్లును అడ్డుకోవాలని చూశారని తెలిపారు.రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశామని వెల్లడించారు.రూ.3,12,319 తలసరి ఆదాయంతో దేశంలోనే నంబర్ వన్ గా నిలిచామని తెలిపారు.