ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా… ఎన్ని శిక్షలు విధించినా రోజురోజుకు ఆడపిల్ల మనుగడ మాత్రం ప్రశ్నార్థకంగానే మారిపోతుంది.ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో విధంగా కామంతో కళ్లు మూసుకుపోయిన మృగాళ్ల బారిన పడుతూ ఏదో విధంగా ఇబ్బందులకు గురి అవుతూనే ఉన్నారు.
తాజాగా ఇలాంటి ఓ సభ్య సమాజం తలదించుకునే ఘటన జరిగింది.14 ఏళ్ల బాలిక తనను ప్రేమించడం లేదు అనే కోపంతో ఓ యువకుడు ఏకంగా వేడినూనె తో ఆ యువతి పై దాడికి దిగాడు.ఈ ఘటన పుదుచ్ఛేరి రాష్ట్రం కిరామబాక్కం ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది.ఆ ప్రాంతంలో నివసిస్తున్న 14 ఏళ్ల బాలికను ఎల్ల మాదేష్ అనే యువకుడు ప్రేమ పేరుతో వెంట పడటం మొదలు పెట్టాడు.
తనను ప్రేమించాలంటూ ఎన్నోసార్లు చెప్పినప్పటికీ బాలిక మాత్రం దానికి అంగీకరించలేదు.దీంతో కోపంతో ఊగిపోయిన సదరు యువకుడు ఈనెల 18న ఇంట్లో ఎవరూ లేని సమయంలో… వేడి నూనెతో ఆ బాలిక పై దాడికి దిగాడు.
దీంతో ఆ బాలిక తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ తీవ్ర గాయాలపాలైంది.కాగా ప్రస్తుతం బాలిక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా బాలిక ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.