ప్రస్తుత కరోనా రోజులలో బాడీ ఫిట్నెస్ కోసం ఎక్ససైజ్ చేస్తూ ఫిట్ నెస్ మైంటైన్ చేస్తూ ఉంటారు చాలమంది.ఎవరి బిజీ లైఫ్ లో ఎన్ని పనులు ఉన్నా కానీ ఫిట్ నెస్ మైంటైన్ చేయడంలో పర్ఫెక్ట్ గా ఉంటున్నారు కొందరు.
తాజాగా ఒక చిన్న పిల్లవాడు చేస్తున్న వర్కౌట్స్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.ఈ వీడియో ఫిట్నెస్ సాధించాలన్న వారికి ఒక స్ఫూర్తిగా నిలుస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ వీడియోలో ఓ పిల్లవాడు పుల్ఆప్స్, బర్పీస్ తో రెచ్చిపోయాడు అనే చెప్పాలి.చేజ్ ఇంగ్రహామ్ అనే ఫిట్నెస్ ట్రైనర్ సోషల్ మీడియా వేదికగా ఆ వీడియోను షేర్ చేశారు.
అందుకు క్యాప్షన్ గా తన కొడుకు డైలాన్ ఎలాంటి శిక్షణ, గైడెలైన్స్ లేకుండానే వర్కవుట్స్ చేయడం మొదలుపెట్టాడు అంటూ తెలియజేశాడు.అంతేకాకుండా ఈ పిల్లవాడు ప్రతిరోజు కూడా ఎటువంటి శిక్షణ లేకుండా ఎక్సర్సైజ్ కచ్చితంగా చేస్తాడట.
అలాగే ప్రతి ఎక్సర్సైజు కూడా చాలా పర్ఫెక్ట్ గా చేస్తూ నెటిజన్స్ ను ఆశ్చర్యపరుస్తున్నాడు.ఇక ఈ వీడియోకు నెటిజెన్స్ స్పందిస్తూ.కొత్తగా ఫిట్నెస్ సాధించాలనే వారికి ఇది ఒక స్ఫూర్తిగా నిలుస్తుందని, అంతేకాకుండా ఈ అబ్బాయి చేసే వర్కౌట్స్ చూస్తే చాలా ఆనందంగా ఉంది అంటూ తెలిపాడు.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ బుడ్డోడి వర్కర్స్ వీడియో చూసేయండి.
ఇదివరకే బ్రిటన్ కు చెందిన ఓ 10 సంవత్సరాల బాలిక కూడా వెయిట్ లిఫ్టింగ్ కోసం ఎంతో కఠోర శ్రమ చేస్తూ, ఎక్సర్సైజ్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరిచింది.అంతేకాకుండా, ఆ అమ్మాయి ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కూడా చెప్పడం నిజంగా ఆశ్చర్యపరిచే విషయం.