మూడేళ్లుగా జన్మభూమికి దూరంగా.. ఇండియా విలువ తెలిసిందంటూ ఎన్ఆర్ఐ ఎమోషనల్

వృత్తి, ఉద్యోగ , వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్లిన భారతీయులు( Indians ) ఎక్కడ ఉన్న తమ మాతృదేశం గురించి, తమ కుటుంబం గురించి ఆలోచిస్తూనే ఉంటారు.తాజాగా ఫ్రాన్స్( France ) రాజధాని పారిస్‌లో నివసిస్తున్న ఒక ప్రవాస భారతీయుడు( NRI ) సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

 Nri From France Shares How Living Abroad Strengthened Connection To Indian Roots-TeluguStop.com

విదేశాలకు వెళ్లడం వల్ల తన భారతీయ మూలాలను తిరిగి కనుగొనడానికి ఎలా కారణమైందో తెలియజేశాడు.మూడేళ్లుగా ఫ్రాన్స్‌లో నివసిస్తున్న సదరు ఎన్ఆర్ఐ.

భారతదేశానికి దూరంగా ఉండటం వల్ల తమ సంస్కృతితో గతంలో కంటే ఎక్కువ అనుసంధానం అయినట్లుగా తెలిపాడు.

ఒకప్పుడు తాము తేలికగా భావించిన భారతీయ ఆహారం, సంగీతం ఇప్పుడు తనకు అత్యంత విలువైనది మారిందన్నారు.

తాను దాదాపు మూడేళ్లుగా పారిస్‌లో నివసిస్తున్నానని.జీవితంలో ఎన్నడూ లేని విధంగా తాను భారతీయుడినని గర్వపడుతున్నట్లు చెప్పారు.

తాను భారతదేశంలో ఉన్నప్పుడు నా సంస్కృతి గురించి పెద్దగా ఆలోచించలేదని.అది సాధారణమైనదిగా, రోజువారీ జీవితంలో ఒక భాగంగా ఉండేదన్నారు.

దేశానికి దూరంగా ఉండటం వల్ల దానిని ఎక్కువగా అనుభూతి చెందుతున్నానని ఆ ఎన్ఆర్ఐ పేర్కొన్నాడు.

Telugu France, France Nri, Indian, Indian Music, Indian Roots, Indians, Paris, P

తాను పంజాబీ( Punjabi ) మూలాలున్న వ్యక్తినని, ఒకప్పుడు భారతదేశంలో ఉన్నప్పుడు నేను పంజాబీ సంగీతాన్ని వినలేదని కానీ ఇప్పుడు అది నన్ను ఉత్తేజపరచడంతో పాటు దేశభక్తి కూడా తీవ్రమైందని ఆ ఎన్ఆర్ఐ చెప్పారు.తరచుగా భారతీయ ఆహారం గురించి ఇతరులకు వివరిస్తున్నానని, విదేశీయులకు భారత్‌పై ఉన్న అపోహలను కూడా తొలగిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Telugu France, France Nri, Indian, Indian Music, Indian Roots, Indians, Paris, P

రెడ్డిట్‌లో షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో డిస్కషన్‌కు దారి తీసింది.పలువురు ప్రవాస భారతీయులు కూడా తమ అనుభవాలను పంచుకుంటున్నారు.విదేశాలలో నివసిస్తున్న ఎంతో మంది తమ భారతీయ మూలాల గురించి ఉదహరించారు.

తాను ఇండియాలో ఉన్నప్పుడు హోలీని, కుటుంబాన్ని, దీపావళి గురించి పెద్దగా పట్టించుకోలేదని.కానీ భారతదేశంలో కంటే విదేశాలలోనే ఎన్ఆర్ఐలు ఉత్సాహంగా దీపావళిని జరుపుకోవడం తాను చూశానని ఓ ప్రవాస భారతీయుడు పంచుకున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube