శంకర్( Shankar ) దర్శకత్వంలో రామ్ చరణ్( Ram Charan ) కియారా అద్వానీ( Kiara Advani ) కలిసిన తాజా చిత్రం గేమ్ చేంజర్.( Game Changer ) తాజాగా పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది.
సినిమా విడుదలకు ముందు ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాలను రాబట్ట లేకపోయింది.
దీంతో ప్రేక్షకులు కాస్త నిరాశ చెందుతున్నారు.అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం తొలిరోజు రూ.186 కోట్లు రాబట్టినట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది.ఇక ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్ బుక్ మై షోలో గేమ్ ఛేంజర్ కు తొలిరోజు 1.3 మిలియన్లకు పైగా టికెట్స్ అమ్ముడైనట్లు సంస్థ వెల్లడించింది.
వారాంతంలో ఈ టికెట్ అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు.అయితే తొలి రోజు ఈ సినిమా భారీగా కలెక్షన్లను సాధిస్తుందని అందరూ అనుకున్నారు.కానీ ఆశించిన స్థాయిలో ఈ సినిమాకు కలెక్షన్లు రాలేదు.
ఇకపోతే ఈ సినిమాలో రామ్ చరణ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి.చరణ్ నటనను చూసి అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు.
అప్పన్న రామ్ నందన్ పాత్రలలో చరణ్ చాలా అద్భుతంగా నటించాడు అని ప్రేక్షకులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఇకపోతే ప్రస్తుతం తక్కువ కలెక్షన్లు సాధించిన ఈ సినిమా వీకెండ్ లో మరిన్ని కలెక్షన్లు రాబడుతుందని మూవీ మేకర్స్ అంచనా వేస్తున్నారు.ఇకపోతే రేపు డాకు మహారాజ్ మూవీ విడుదల అవుతున్న విషయం తెలిసిందే.మరి ఈ సినిమా ముందు ముందు మంచి మంచి కలెక్షన్లను సాధిస్తుందా లేదా అన్నది చూడాలి మరి.ఒకవేళ డాకు మహారాజ్ సినిమా కనుక సూపర్ హిట్గా నిలిస్తే ఈ సినిమా కలెక్షన్ల విషయంలో కాస్త వెనకబడడం ఖాయం అని తెలుస్తోంది.డాకు మహారాజ్ మూవీ పై కూడా బోలెడు అంచనాలు ఉన్నాయి.