సాధారణంగా కొందరి ముఖం ఎంతో తెల్లగా ఉంటుంది.కానీ, సున్నితంగా మాత్రం ఉండదు.
కఠినమైన సోప్స్‌ను వినియోగించడం, మాశ్చరైజర్స్ను ఎవైడ్ చేయడం, ఎండల ప్రభావం, ఆహారపు అలవాట్లు, పలు పోషకాల కొరత, మేకప్‌తో నిద్రించడం, కెమికల్స్ ఎక్కువగా ఉండే స్కిన్ ప్రోడెక్ట్స్‌ను వాడటం వంటి రకరకాల కారణాల వల్ల చర్మం మృదుత్వాన్ని కోల్పోతుంది.ఫలితంగా ముఖ సౌందర్యం తీవ్రంగా దెబ్బ తింటుంది.
దాంతో ఏం చేయాలో అర్థంగాక, ఎలా చర్మాన్ని మళ్లీ మృదువుగా మార్చుకోవాలో తెలియక ఆగమాగం అవుతుంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ సీరమ్‌ను వాడితే.
సహజంగానే ముఖాన్ని స్మూత్‌గా మరియు షైనీగా మార్చుకోవచ్చు.మరి ఇంకెందుకు లేటు ఆ సీరమ్‌ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండీ.
ముందుగా ఒక బౌల్లో నాలుగు టేబుల్ స్పూన్ల ఓట్స్ వేసుకుని.గ్లాస్ వాటర్ పోసి రెండు నుంచి మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి.
ఇలా నానబెట్టుకున్న ఓట్స్‌ను వాటర్‌తో సహా బ్లెండర్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని జ్యూస్‌ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు మరో బౌల్లో నాలుగు టేబుల్ స్పూన్ల ఓట్స్ జ్యూస్‌ను వేసుకోవాలి.
అలాగే అందులో రెండు టేబుల్ స్పూన్ల అలోవెర జెల్, వన్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్, వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా మిక్స్ చేసుకుంటే సీరమ్ సిద్ధమైనట్లే.

ఈ సీరమ్‌ను ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే పది రోజుల పాటు వాడుకోవచ్చు.ఉదయం స్నానం చేయడానికి గంట ముందు మరియు నైట్ నిద్రించడానికి ముందు ఈ సీరమ్‌ను అప్లై చేసుకోవాలి.ఇలా రోజుకు రెండు సార్లు ఈ సీరమ్‌ను వాడితే ముఖం స్మూత్ అండ్ షైనీగా మారుతుంది.
మరియు స్కిన్ టోన్ కూడా ఇంఫ్రూవ్ అవుతుంది.