టాలీవుడ్ హీరోకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సూర్య... ఎవరంటే?

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు సూర్య( Suriya )కు ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే.ఈయన కోలీవుడ్ హీరో అయినప్పటికీ తెలుగులో కూడా ఈయనకు అదే స్థాయిలో అభిమానులు ఉన్నారు.

 Surya Is Gave Green Signal To Tollywood Hero ,suriya, Kanguva , Social Media , C-TeluguStop.com

తెలుగులో ప్రస్తుతం రీ రిలీజ్ సినిమాల హవా నడుస్తుంది.అలాంటిది కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన డబ్బింగ్ సినిమాని కూడా రీ రిలీజ్ చేశారు అంటే ఈయనకు తెలుగులో ఏ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అర్థం అవుతుంది.

ఇక సూర్య సినిమాలు వస్తున్నాయి అంటే తెలుగు ప్రేక్షకులు చేసే హంగామా కూడా మామూలుగా ఉండదు.

Telugu Chandu Mondeti, Chiranjeevi, Kanguva, Kollywood, Nagachaitanya, Suriya, T

ఇక సూర్య పుట్టినరోజున కూడా అభిమానులు చేసే హంగామా మామూలుగా ఉండదు.ఇలా తెలుగులో ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నటువంటి సూర్య తెలుగు డైరెక్టర్ తో కలిసి సినిమా చేయడానికి సిద్ధమయ్యారు.ఈ మధ్యకాలంలో కోలీవుడ్ హీరోలు అందరూ కూడా తెలుగు డైరెక్టర్లతో పని చేయడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు.

ఇప్పటికే ధనుష్, కార్తీ,విజయ్ వంటి హీరోలు తెలుగు డైరెక్టర్ల దర్శకత్వంలో సినిమాలు చేసిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే సూర్య కూడా తెలుగు డైరెక్టర్ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.

Telugu Chandu Mondeti, Chiranjeevi, Kanguva, Kollywood, Nagachaitanya, Suriya, T

ప్రస్తుతం సూర్య కంగువ( Kanguva )సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.ఈ సినిమా తర్వాత మరో రెండు తమిళ సినిమాలతో ఈయన బిజీగా మారబోతున్నారు.అనంతరం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి డైరెక్టర్ చందు మొండేటి( Chandu Mondeti ) తో నటించడానికి సూర్యా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.కాంబినేషన్లో ఓ ఫాంటసీ యాక్షన్ డ్రామాను ప్లాన్ చేస్తున్నారు.

ప్రస్తుతం డైరెక్టర్ చందు నాగచైతన్య( Nagachaitanya )తో ఓ సినిమా పనులలో బిజీగా ఉన్నారు.త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారక ప్రకటన వెలబడబోతున్నట్లు తెలుస్తుంది.

ఇలా సూర్య తెలుగులో నటించబోతున్నారు అనే విషయం తెలియడంతో సూర్య అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube