కల్కి2 మూవీలో కల్కి రోల్ లో జూనియర్ ఎన్టీఆర్.. అదే జరిగితే బాక్సాఫీస్ షేకవుతుందా?

టాలీవుడ్ హీరో ప్రభాస్( Prabhas ) తాజాగా నటించిన చిత్రం కల్కి.( Kalki ) ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.

 Jr Ntr Played Kalki Role In Kalki 2 Movie Details, Jr Ntr, Kalki Role, Kalki 2 M-TeluguStop.com

నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్ తో నిర్మించింది.గత నెల అనగా జూన్ 27న విడుదలైన ఈ సినిమా ఇప్పటికే 700 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి 1000 కోట్ల దిశగా దూసుకుపోతోంది.

ఇకపోతే ఈ సినిమాలో మహాభారతంలోని పలు కీలక పాత్రలు కనువిందు చేసిన విషయం తెలిసిందే.

Telugu Ashwini Dutt, Nag Ashwin, Jr Ntr, Kalki, Kalki Role, Kamal Haasan, Ntr Ka

అయితే మొదటి ఈ సినిమా టైటిల్ ప్రకటన వచ్చినప్పుడు చిత్రంలో కల్కి పాత్రలో ప్రభాస్ కనిపిస్తాడని అందరూ భావించారు.కానీ ఇందులో ప్రభాస్ భైరవ పాత్రలో కనిపించారు.అలాగే మహాభారతంలోని ఒక కీలక పాత్రలో నటించారు.

కానీ ఇందులో అసలైన కల్కి ఎవరు అనేది మాత్రం ఇంకా రివీల్ కాలేదు.కల్కి యూనివర్స్ లో భాగంగా పలు సినిమాలు రానున్నాయి.

ఇప్పటికే కల్కి 2 ని( Kalki 2 ) అధికారికంగా ప్రకటించారు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ 60 శాతం షూటింగ్ పూర్తి అయినట్లు నిర్మాత అశ్విని దత్ తెలిపారు.

ఈ కల్కి పార్ట్ 2 ను వచ్చే ఏడాది జూన్ లోపు విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.ఇందులో కల్కి ఎవరు అన్నది రివిల్ కానుంది.

Telugu Ashwini Dutt, Nag Ashwin, Jr Ntr, Kalki, Kalki Role, Kamal Haasan, Ntr Ka

అయితే ఈ యూనివర్స్ లో కల్కిగా జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) కనువిందు చేయనున్నాడని ప్రచారం జరుగుతోంది.అంతేకాదు, ఎన్టీఆర్ తో పాటు పలువురు స్టార్స్ ఇతర కీలక పాత్రల్లో మెరవనున్నారట.అదే జరిగితే బాక్సాఫీస్ షేక్ అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.మొదటి భాగమే వెయ్యి కోట్లకు పైగా కలెక్ట్ చేసేలా ఉంది.అలాంటిది రెండో భాగానికి మరికొందరు స్టార్స్ తో డైతే ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో ఊహలకు కూడా అందదేమో.ఆ దెబ్బకు బాహుబలి-2 రికార్డులు కూడా బ్రేక్ కావడం ఖాయమే.

దానికి తోడు కల్కి 2 మూవీలో కల్కి రోల్ ఎన్టీఆర్ నటించనున్నాడు అనే వార్తని గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంది.ఒకవేళ అదే నిజమైతే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం అని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube