ఎమ్మెల్యే Vs మాజీ ఎంపీ… రాజమండ్రిలో ప్రమాణాల సవాల్ ! 

రాజమండ్రి ( Rajahmundry ) రాజకీయాలు వేడెక్కాయి.ప్రస్తుత అధికార పార్టీ టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యే వర్సెస్ వైసిపి మాజీ ఎంపీ మధ్య సవాల్ , ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి.

 War Of Words Between Mla Adireddy Vasu Ex Mp Margani Bharat-TeluguStop.com

రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్( Margani Bharat ) ఎన్నికల ప్రచార రథం దగ్ధం ఘటన పై ఇంకా రాజకీయ మంటలు రాసుకుంటూనే ఉన్నాయి.రెండు పార్టీల మధ్య ఈ వ్యవహారం కారణంగా వివాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.

రాజకీయ సానుభూతి కోసమే వైసీపీ నేతలు రథాన్ని తగలబెట్టుకున్నారని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు( MLA Adireddy Vasu ) ఆరోపిస్తుండగా ,  దీని వెనక భారీ కుట్ర ఉందని ,మార్కండేయ గుడిలో సత్య ప్రమాణానికి సిద్దమా అని మాజీ ఎంపీ మార్గాని భరత్ సవాల్ విసిరారు. 

రాజమండ్రిలో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెబుతున్నారు.  వాళ్ళ ప్రచార రధాలు వాళ్లే తగలబెట్టుకుని , టిడిపి నేతలపై నిందలు వేస్తున్నారని,  ఈ ఘటనపై  శనివారం క్లారిటీ ఇస్తానని ఆదిరెడ్డి వాసు అన్నారు.ఇప్పటికే రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కి మార్గాని భరత్ సవాల్  విసిరారు.వాళ్ళు ఎటువంటి తప్పు చేయకుంటే రాజమండ్రి మార్కండేయ స్వామి గుడిలో ప్రమాణానికి సిద్ధమా అని సవాల్ విసిరారు వాహనాలు తగలబెట్టుకునే నీచ సంస్కృతి తమది కాదని ,

ఇప్పుడు ఎన్నికలు కూడా లేవు,  తనుకు సింపతి ఎందుకని భరత్ ప్రశ్నించారు.వాహనాల దగ్ధంలో ఏదో కుట్ర దాగి ఉందని మార్గాని భరత్ ఆరోపించారు.దీంతో ఈ వ్యవహారం రాజమండ్రి రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది .మార్గాని భరత్ విసిరిన సవాల్ కు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఏం చేయబోతున్నారు ?  రేపు మీడియా సమావేశం నిర్వహించబోతున్న వాసు ఈ సందర్భంగా ఏ ప్రకటన చేయబోతున్నారనేది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube