చైనాలో( China ) ఒక విచిత్ర సంఘటన చోటు చేసుకుంది.ఒక ఇంటర్నెట్ కేఫ్‌లో( Internet Cafe ) ఒక కస్టమర్ మరణించిన విషయం కేఫ్ సిబ్బందికి చాలా ఆలస్యంగా తెలిసింది.
మరణించిన వ్యక్తి గుర్తింపును ఇంకా వెల్లడించలేదు.జూన్ 1న ఆయన ఒక లాంగ్ గేమ్ సెషన్ కోసం కేఫ్ లోకి వెళ్లాడు.
జూన్ 3వ తేదీ రాత్రి 10 గంటలకు, కేఫ్‌లో పనిచేసే ఒక వ్యక్తి ఆయన్ను లేపడానికి ప్రయత్నించాడు.కానీ, అతడు స్పందించలేదు.
అంతేకాకుండా, అతని శరీరం చల్లగా ఉందని గమనించాడు.
ఆందోళన చెందిన కేఫ్ సిబ్బంది పోలీసులకు ఫోన్ చేశారు.పోలీసులు వచ్చి సదరు వ్యక్తి మరణించినట్లు నిర్ధారించారు.ఈ సంఘటన చైనాలోని వెంజౌ, జెజియాంగ్ ప్రావిన్స్ లో( Jiangsu Province ) జరిగింది.
మరణించిన వ్యక్తికి 29 ఏళ్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు.ఈ యువకుడు ఒక రెగ్యులర్ కస్టమర్, 6 గంటల వరకు గేమ్స్ ( Games ) ఆడటానికి కేఫ్ కి వచ్చేవాడు.
జూన్ 1న రాత్రి నుంచి ఆయన కేఫ్‌లోనే ఉండి, జూన్ 2వ తేదీ ఉదయం 6 గంటలకు బ్రేక్‌ఫాస్ట్ కోసం బయటకు వెళ్లాడు.జూన్ 2వ తేదీ మధ్యాహ్నం భోజనం చేయలేదని, అతని టేబుల్‌పై బ్రేక్‌ఫాస్ట్ మిగిలి ఉండటం ద్వారా తెలుసుకున్నారు.
జూన్ 3వ తేదీ రాత్రి 10 గంటలకు, కేఫ్ సిబ్బంది ఆయనను లేపడానికి ప్రయత్నించగా, స్పందించలేదు.ఆయన శరీరం చల్లగా ఉండటంతో, పోలీసులకు ఫోన్ చేశారు.పోలీసులు( Police ) వచ్చి ఆయన మరణించినట్లు నిర్ధారించారు.మరణానికి కారణం ఇంకా తెలియదు.పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.కేఫ్ యజమాని( Cafe Owner ) తన సిబ్బందికి ఈ చావుతో సంబంధం లేదని స్పష్టంగా తెలియజేశారు.
ఆ యువకుడు ఆరోగ్యంగా కనిపించాడని, చాలాసార్లు గంటల తరబడి గేమ్స్ ఆడటానికి వచ్చేవాడని చెప్పాడు.గేమర్లు తరచుగా గేమ్‌ల మధ్య నిద్రపోతారని, లేపడం వల్ల వారికి చిరాకుగా ఉంటుందని, అందుకే సిబ్బందిని తిట్టేవారని కూడా చెప్పాడు.
చనిపోయిన 29 ఏళ్ల యువకుడి బావ చెన్ మీడియాతో మాట్లాడుతూ, ఫ్యామిలీ పోస్ట్‌మార్టమ్‌కు అనుమతి ఇవ్వలేదని, అందువల్ల మరణ సమయాన్ని ఖచ్చితంగా నిర్ధారించలేకపోయామని చెప్పారు.యువకుడు బహిరంగ ప్రాంతంలో కూర్చొని ఉండగా, అతని మరణం గురించి ఒక రోజు పాటు ఎవరికీ తెలియకపోవడం ఏంటని చెన్ ప్రశ్నించాడు.