కళ్ళ కింద ఉబ్బడం. కోట్లాది మంది ఫేస్ చేసే కామన్ సమస్య ఇది.
కంటి నిండా నిద్ర లేకపోవడం, ల్యాప్‌టాప్ల ముందు గంటలు తరబడి కూర్చుని పని చేయడం, ఏడవటం, అధిక ఒత్తిడి, టీ కాఫీలు ఎక్కువగా తీసుకోవడం, పోషకాల కొరత, డీహైడ్రేషన్ వంటి రకరకాల కారణాల వల్ల కళ్ళ కింద చర్మం ఉబ్బినట్లు మారుతుంది.ఉబ్బిన కళ్ళను అలానే వదిలేస్తే ముఖం అందవిహీనంగా కనిపిస్తుంది.
అందుకే ఈ సమస్యను నివారించుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాను పాటిస్తే గనుక చాలా అంటే చాలా సులభంగా ఉబ్బిన కళ్ళ నుంచి ఉపశమనం పొందొచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ చిట్కా ఏంటో ఓ చూపు చూసేయండి.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ వాసెలిన్, వన్ టేబుల్ స్పూన్ కొకొనట్ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ మరియు వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని కలుపుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరో గిన్నె పెట్టుకుని వాటర్ పోయాలి.

వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత అందులో ఇన్‌గ్రీడియంట్స్ అన్నీ వేసుకున్న బౌల్‌ను పెట్టి డబుల్ బాయిలర్ మెథడ్‌లో ఒక నిమిషం పాటు హీట్ చేయాలి.ఆపై స్టవ్ ఆఫ్ చేసుకుని హీట్ చేసిన మిశ్రమాన్ని చల్లారబెట్టుకోవాలి.

కూల్ అయిన అనంతరం ఈ మిశ్రమాన్ని కళ్ళ కింద అప్లై చేసి రెండు నుంచి మూడు నిమిషాల పాటు స్మూత్‌గా వేళ్లతో మసాజ్ చేసుకోవాలి.ఆపై గంట పాటు డ్రై అవ్వనిచ్చి అప్పుడు నార్మల్ వాటర్‌తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా చేస్తే గనుక కళ్ళ కింద ఉబ్బిన చర్మం మళ్లీ మామూలు స్థితికి వచ్చేస్తుంది.
పైగా రోజూ ఈ చిట్కాను పాటిస్తే కళ్ళ కింద నలుపు, ముడతలు కూడా క్రమంగా తగ్గిపోతాయి.