మన శరీరంలో ఏ పోషకం లోపిస్తే ఏ లక్షణాలు కనిపిస్తాయో తెలుసా

మన శరీరంలో పోషకాలు లోపిస్తే ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.అయితే కొన్ని పోషకాలు లోపించిన సరే ఎటువంటి అనారోగ్య సమస్యలు కలగవు.

 Nutrition Deficiency Symptoms-TeluguStop.com

కానీ కొన్ని లక్షణాలు మాత్రం కనిపిస్తాయి.ఇప్పుడు ఏ పోషకాల కారణంగా ఏ లక్షణాలు కనపడతాయో తెలుసుకుందాం.

అరచేతులు చల్లగా అవుతూ ఉంటె మెగ్నీషియం లోపంగా భావించాలి.అలాగే గుండె బలహీనత, హైపో థైరాయిడిజం ఉన్నప్పుడు కూడా అరచేతులు చల్లగా మారతాయి.శరీరంలో మెగ్నీషియం లోపం ఉంటే కాలి పిక్కలు పట్టేయటం మరియు మోకాలు కీళ్లు పట్టేస్తూ ఉంటాయి.అలాగే గోళ్లు బలహీనంగా ఉండి విరిగిపోతూ ఉంటే కూడా మెగ్నీషియం లోపంగా భావించాలి.

చర్మం మీద చారలు,గోళ్ళ మీద చారలు ఏర్పడితే జింక్ లోపంగా భావించాలి.

చిన్న చిన్న గాయాలకే రక్తస్రావం అవుతూ ఉంటే విటమిన్‌ కె లేదా విటమిన్‌ సి లోపం అని భావించాలి.

రక్తంలో ప్లేట్‌లెట్లు తగ్గినా రక్తస్రావం ఎక్కువగా అవుతుంది.

శరీరంలో అయొడిన్‌ లోపం ఉంటే గొంతు వాపు హైపో థైరాయిడిజంకి సూచనగా భావించాలి.

ఐరన్‌ లోపం ఉంటే నాలుక తెల్లగా పాలిపోతుంది.

విటమిన్ B2 తగ్గితే పెదవులు పగులుతాయి.

నాలుక నున్నగా తయారయ్యి నొప్పిగా ఉంటే ఫోలిక్ యాసిడ్ తగ్గిందని అర్ధం చేసుకోవాలి.

నోట్లో నొప్పితో కూడిన ఎర్రటి పుండ్లు ఏర్పడితే విటమిన్ B3 లోపంగా అర్ధం చేసుకోవాలి.

ముఖం మీద, ముక్కు పక్కల ఎర్రగా కంది, తోలు లేస్తుంటే విటమిన్‌ బి2 లోపించిందని తెలుసుకోవాలి.నుదురు మీద, ముక్కు పక్కన‌ నూనెతో కూడిన పొక్కులొస్తుంటే విటమిన్‌ బి6 తగ్గిందని అనుకోవాలి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube