Mahi V Raghav Yatra 3 : యాత్ర 3 మూవీ గురించి దర్శకుడు స్పందన ఇదే.. ఆ సినిమా గురించి రియాక్షన్ ఇదే!

రెండు తెలుగు రాష్ట్రాల్లో యాత్ర 2 మూవీ( Yatra 2 ) డీసెంట్ కలెక్షన్లను సాధిస్తున్న సంగతి తెలిసిందే.మహి వి రాఘవ్( Mahi V Raghav ) ఈ సినిమాకు దర్శకుడు కాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ఎంబీఏ చదివానని రెండేళ్ల పాటు బిజినెస్ చేసి యూకేకు వెళ్లానని ఆయన తెలిపారు.

 Director Mahi V Raghav Reaction About Yatra 3 Movie Details-TeluguStop.com

వినాయకుడు మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశానని మహి వి రాఘవ్ వెల్లడించారు.నా సినిమాను నేను మార్కెటింగ్ చేసుకోగలనని ఆయన తెలిపారు.

పని నేర్చుకోవాలని అనుకుంటే ఏ పేరుతో అయినా నేర్చుకోవచ్చని మహి వి రాఘవ్ చెప్పుకొచ్చారు.మహి వి రాఘవ్ యాత్ర 2 సక్సెస్ మీట్ లో( Yatra 2 Success Meet ) మాట్లాడుతూ యాత్ర2 నచ్చిన వాళ్లకు, నచ్చని వాళ్లకు కృతజ్ఞతలు అని కామెంట్లు చేశారు.

యాత్ర 2 మూవీ విషయంలో ఎవరి అభిప్రాయాలు వాళ్లకు ఉంటాయని ఆయన వెల్లడించారు.ప్రేక్షకుల నుంచి యాత్ర2 సినిమాకు సంబంధించి వచ్చిన ఫీడ్ బ్యాక్ మాత్రం బాగుందని ఆయన చెప్పుకొచ్చారు.

Telugu Cm Jagan Biopic, Mahi Raghav, Jiiva, Mammootty, Yatra, Yatra Sequel, Yatr

యాత్ర2 మూవీ కమర్షియల్ మూవీ కాదని మహి వి రాఘవ్ వెల్లడించారు.యాత్ర2 సినిమాకు పని చేసిన టెక్నీషియన్లకు కృతజ్ఞతలు అని ఆయన అన్నారు.2019 సంవత్సరంలోనే యాత్ర2 సినిమా చేయాలని అనుకున్నానని అయితే ఆ సినిమా తీయడం ఇప్పటికి సాధ్యమైందని మహి వి రాఘవ్ చెప్పుకొచ్చారు.యాత్ర 3 సినిమా( Yatra 3 ) గురించి ప్రశ్నలు ఎదురు కాగా యాత్ర3 గురించి ఆలోచించలేదని ఆయన కామెంట్లు చేశారు.

Telugu Cm Jagan Biopic, Mahi Raghav, Jiiva, Mammootty, Yatra, Yatra Sequel, Yatr

యాత్ర2 సినిమా కలెక్షన్ల విషయంలో నిర్మాతలు సైతం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.వైఎస్సార్ ను అభిమానించే వాళ్లకు మాత్రం ఈ సినిమా ఎంతో నచ్చింది.నటీనటుల ఎంపికలో యాత్ర2 మేకర్స్ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని అర్థమవుతోంది.యాత్ర3 మూవీ రాబోయే రోజుల్లో సెట్స్ పైకి వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube