సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy )అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది.దాదాపు మూడున్నర గంటల పాటు సాగింది.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జూన్ 2న ఘనంగా నిర్వహించాలని కేబినెట్ భేటిలో ప్రభుత్వం నిర్ణయించింది.తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ముఖ్యఅతిథిగా తీసుకురావాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.
కాగా కేబినెట్ భేటి అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీ( Ponguleti Srinivas Reddy )లక వ్యాఖ్యలు చేశారు.కాలేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజిపై నేషనల్ డ్యాన్స్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికపై మంత్రివర్గ సమావేశంలో చర్చించినట్లు స్పష్టం చేశారు.
ఈ క్రమంలో మేడిగడ్డకు మరమ్మత్తులు చేసిన ఉంటుందని గ్యారెంటీ లేదని కమిటీ చెప్పిందని వెల్లడించారు.

ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజీ( Medigadda Barrage )లో నీళ్లు నిలువ చేసే పరిస్థితి కూడా లేదని ఎన్డీఎస్ఏ తెలిపినట్లు పేర్కొన్నారు.అదేవిధంగా కాలేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎన్డీఎస్ఏ సూచనలు అనుగుణంగా వ్యవహరిస్తామని అన్నారు.ఈ క్రమంలో తాత్కాలికంగా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసి రైతులకు సాగునీరు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలియజేశారు.
ధాన్యం సేకరణకి సంబంధించి కూడా మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేశారు.గతంలో ఎన్నడూ లేని విధంగా వేగవంతంగా తమ ప్రభుత్వం వచ్చాక ధాన్యం సేకరణ జరిగిందని తెలిపారు.
తూకం పూర్తయిన ఐదు రోజుల్లోనే రైతుల అకౌంట్లో డబ్బులు వేస్తున్నామన్నారు.రాష్ట్రంలోని ప్రజలకు విద్యార్థులకు అవసరమైన 36 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని రాష్ట్రంలోనే సేకరిస్తామన్నారు.అందుకే సన్న వడ్లకే క్వింటాల్ కు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని కేబినెట్ భేటిలో నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు.