Beet Root : బీట్ రూట్ రోజూ తీసుకుంటే ప్రమాదమా.. కచ్చితంగా తెలుసుకోండి!

బీట్ రూట్( Beet root ).అత్యంత ఆకర్షణీయమైన కూరగాయల్లో ఒకటి.

 Is Beetroot Safe To Consume Daily-TeluguStop.com

దుంప జాతికి చెందిన బీట్ రూట్ తియ్యటి రుచిని కలిగి ఉంటుంది.అలాగే బోలెడన్ని పోషకాలతో లోడ్ చేయబడి ఉంటుంది.

చాలా మంది బీట్ రూట్ ను జ్యూస్, సలాడ్స్, కర్రీ( Juice, salads, curry ) ఇలా ఏదో ఒక రూపంలో నిత్యం తీసుకుంటారు.అయితే బీట్ రూట్ ను రోజు తీసుకుంటే ప్రమాదమని కొందరు భావిస్తుంటారు.

కానీ అది కేవలం అపోహ మాత్రమే.బీట్ రూట్ ను నిత్యం తీసుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

పైగా బోలెడు ఆరోగ్య లాభాలు చేకూరుతాయి.

మెద‌డు ఆరోగ్యానికి బీట్ రూట్ చాలా మేలు చేస్తుంది.

బీట్ రూట్‌లోని నైట్రేట్‌లు మెదడుకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి.దాంతో అభిజ్ఞా పనితీరు రెట్టింపు అవుతుంది.

అలాగే బీట్‌రూట్ కాలేయ పనితీరును ప్రేరేపించడంలో సహాయపడుతుంది.బీట్ రూట్ జ్యూస్‌ను నిత్యం తీసుకుంటే.

అందులో ఉండే ప‌లు పోషకాలు శరీరం నుండి విషాన్ని తొలగిస్తాయి.

Telugu Beetroot, Eat Beetroot, Tips, Beetrootconsume, Latest-Telugu Health

బీట్‌రూట్‌లో ఐరన్ మరియు ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి.అందువ‌ల్ల ర‌క్త‌హీన‌త( Anemia ) బాధితుల‌కు బీట్ రూట్ సూప‌ర్ ఫుడ్‌గా చెప్ప‌వ‌చ్చు.రెగ్యుల‌ర్ డైట్ లో బీట్ రూట్ ను చేర్చుకుంటే ఎర్ర రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుంది.

రక్తహీనత ప‌రార్ అవుతుంది.బీట్ రూట్ తియ్య‌గా ఉండ‌టం వ‌ల్ల మ‌ధుమేహం ఉన్న‌వారు దీనిని తినేందుకు వెన‌క‌డుగు వేస్తుంట‌టారు.

తియ్య‌గా ఉన్నా కూడా బీట్ రూట్ తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది.అంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలపై తక్కువ ప్రభావాన్ని చూపుతుంది.

Telugu Beetroot, Eat Beetroot, Tips, Beetrootconsume, Latest-Telugu Health

పైగా బీట్ రూట్‌లోని ఫైబర్ మరియు నైట్రేట్ కంటెంట్ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో మరియు బ్లడ్ షుగర్ లెవల్స్‌ను నియంత్రించడంలో సహాయపడ‌తాయి.కాబ‌ట్టి బీట్ రూట్ డయాబెటిక్-ఫ్రెండ్లీ ఫుడ్ ( Diabetic-friendly food )గా చెప్ప‌బ‌డింది.అలాగే బీట్ రూట్ లో కేల‌రీలు త‌క్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల వెయిట్ లాస్ అవ్వాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న వారికి అద్భుతమైన ఎంపిక అవుతుంది.అంతేకాకుండా బీట్ రూట్‌ను నిత్యం తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.

గుండె సంబంధిత జబ్బులు దరిచేరకుండా ఉంటాయి.రోజంతా ఫుల్ ఎనర్జిటిక్ గా ఉంటారు.

మరియు చర్మ ఆరోగ్యం సైతం మెరుగ్గా మారుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube