కొంతమందికి సక్సెస్ తక్కువ సమయంలోనే దక్కితే మరి కొందరికి సక్సెస్ దక్కాలంటే చాలా సమయం పడుతుంది.అయితే గుంటూరుకు( Guntur ) చెందిన భవ్యకు( Bhavya ) మాత్రం తను అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఎనిమిదేళ్ల సమయం పట్టింది.
రేయింబవళ్లు తన లక్ష్యాన్ని సాధించడం కోసం భవ్య పుస్తకాలతో కుస్తీ పట్టారు.భవ్య పూర్తి పేరు వట్టికూటి భవ్య( Vattikuti Bhavya ) కాగా ఆరో ప్రయత్నంలో భవ్య సక్సెస్ సాధించడం గమనార్హం.
తనది గుంటూరు జిల్లా పొన్నూరు అని ఇంటర్ లో 982 మార్కులు సాధించానని ఆమె తెలిపారు.ఇంటర్ లో మంచి మార్కులు రావడంతో భవ్యకు విజ్ఞాన్ కాలేజ్ లో బీటెక్ సీట్ దొరికింది.క్యాంపస్ ఇంటర్వ్యూలో టీసీఎస్ లో జాబ్ వచ్చినా సివిల్స్ పై ఆసక్తితో భవ్య సివిల్స్ పై( Civils ) దృష్టి పెట్టారు.2016 సంవత్సరంలో కోచింగ్ మొదలుపెట్టానని ఆమె చెప్పుకొచ్చారు.తొలి ప్రయత్నంలో ప్రిలిమ్స్ కూడా పాస్ కాలేదని భవ్య వెల్లడించారు.

రెండో ప్రయత్నంలో ఇంటర్వ్యూ వరకు వెళ్లానని ఆమె పేర్కొన్నారు.3, 4, 5 ప్రయత్నాలలో ప్రిలిమ్స్ క్లియర్ చేసినా మెయిన్స్ క్లియర్ చేయలేదని భవ్య చెప్పుకొచ్చారు.ఆ సమయంలో రాష్ట్ర సర్వీస్ లపై దృష్టి పెట్టి 2022 గ్రూప్1 ఫలితాల్లో ఎంపీడీవో జాబ్( MPDO Job ) సాధించానని భవ్య చెప్పుకొచ్చారు.
సివిల్స్ ఆఖరి ప్రయత్నంలో స్పోర్ట్స్ అథారిటీలో అసిస్టెంట్ డైరెక్టర్ జాబ్ సాధించానని ఆమె తెలిపారు.

పరీక్ష ఫెయిల్ అయిన సమయంలో కలిగే బాధను మాటల్లో చెప్పలేమని భవ్య కామెంట్లు చేశారు.కరోనా సమయంలో రోజుకు 10 గంటలు ప్రిపేర్ అయిన రోజులు ఉన్నాయని భవ్య వెల్లడించారు.ఒకే మెటీరియల్ ఎక్కువసార్లు చదివితే పరీక్ష బాగా రాస్తామని ఆమె పేర్కొన్నారు.
భవ్య వెల్లడించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతుండగా ఆమె సక్సెస్ స్టోరీ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.భవ్య రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను అందుకుంటారేమో చూడాలి.







