ఇటీవల జరిగిన ఏపీ, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోరు హోరాహోరీగా సాగింది.ఈ ఎన్నికల్లో వైసిపి( YCP ) ఒంటరిగా ఎన్నికలకు వెళ్ళగా, టిడిపి, జనసేన, బిజెపిలు కలిసి పోటీ చేశాయి.ఎవరికి వారు గెలుపు ధీమాతో ఉన్నారు.2019 ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి లు విడివిడిగానే పోటీ చేశాయి.వైసిపి కూడా ఒంటరిగానే ఎన్నికలకు వెళ్ళింది.ఈ ఎన్నికల్లో వైసీపీ 175 స్థానాలకు గాను, 151 సీట్లను దక్కించుకుని తిరుగులేని శక్తిగా ఏపీ అధికార పీఠంపై కూర్చుంది.
ఇక 2024 ఎన్నికల్లోనూ ఇదే తరహా ఎన్నికల ఫలితాలు వెలువడుతాయని ఆ పార్టీ ఆశలు పెట్టుకోగా, టిడిపి, జనసేన, బిజెపి కూటమి( TDP Janasena BJP Alliance ) కచ్చితంగా అధికారంలోకి వస్తుందని, తమ మూడు పార్టీలు కలిసి పోటీ చేసిన నేపథ్యంలో తమకు తిరుగు ఉండదు అనే లెక్కలు వేసుకుంటున్నాయి.
ఇది ఇలా ఉంటే జనసేన పార్టీ( Janasena Party ) వ్యవహారం ఇప్పుడు చర్చినీయాంసంగా మారింది.ఈ ఎన్నికల్లో 21 అసెంబ్లీ స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేశారు.అయితే వీరిలో సగానికి పైగా తప్పకుండా గెలుస్తారనే అంచనాతో జనసేన ఉంది.
ఈ మేరకు ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సమయంలో వచ్చిన రెస్పాన్స్.పోలింగ్ జరిగిన తీరు ఇవన్నీ తమకు అనుకూలంగా ఉన్నాయని ఆ పార్టీ పూర్తి నమ్మకంతో ఉంది.కచ్చితంగా 12 నుంచి 15 స్థానాల్లో గెలుస్తామని, బలమైన అభ్యర్థులను పోటీకి దించడంతో ఈ ఫలితాలు సాధ్యం కాబోతున్నాయని ఆ పార్టీ కీలక నాయకులే చెబుతున్నారు.2024 ఎన్నికల్లో పవన్ తో( Pawan Kalyan ) సహా ఆ పార్టీకి చెందిన 10 ,15 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగు పెడతారనే అంచనాలతో ఆ పార్టీ ఉంది.
తమకు 12 నుంచి 15 స్థానాలు వచ్చినా, ఏపీ రాజకీయాల్లో తాము కీలకం అవుతామని, టిడిపి ( TDP ) ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ కు కావాల్సిన సీట్లు దక్కించుకోలేకపోతే, తమ ప్రాధాన్యం మరింతగా పెరుగుతుందని, ప్రభుత్వంలో జనసేనకు కీలక పదవులు దక్కుతాయని ఆ పార్టీ అంచనా వేస్తోంది.కర్ణాటకలో జేడీఎస్ కుమారస్వామి( Kumaraswamy ) మాదిరిగా కనీసం ఒక్క ఏడాది అయినా పవన్ కళ్యాణ్ సీఎం అయ్యేందుకు అవకాశం ఉంటుందని జనసైనికులు అంచనాలు వేసుకుంటున్నారు.అంతేకాదు 2029 నాటికి ఒంటరిగా జనసేన ను బలోపేతం చేసి, తిరుగులేని శక్తిగా మార్చేందుకు అవకాశం ఏర్పడుతుందనే ధీమా పవన్ తో పాటు, జనసైనికుల్లోనూ కనిపిస్తుంది.